Updated : 17/11/2021 13:27 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు


 

1.తెరాస కనుసన్నల్లోనే ఎన్నికల ప్రక్రియ: రేవంత్‌రెడ్డి

తెలంగాణ శాసనమండలి తెరాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై కాంగ్రెస్‌ నేతలు అసెంబ్లీలో మండలి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. వెంకట్రామిరెడ్డిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఐఏఎస్‌గా ఉన్నప్పుడు అక్రమాలు చేశారని కాంగ్రెస్‌ నేతలు రిటర్నింగ్‌ అధికారికి వివరించారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

2.కొనసాగుతున్న ‘పుర’ ఓట్ల కౌంటింగ్‌

ఏపీలో పుర ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. కడప జిల్లా రాజంపేట పురపాలిక, కర్నూలు జిల్లా బేతంచర్ల, కడప జిల్లా కమలాపురం, గుంటూరు జిల్లా దాచేపల్లి, గురజాల నగర పంచాయతీలను వైకాపా కైవసం చేసుకుంది. ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీలో తెదేపా విజయం సాధించింది.

లైవ్‌బ్లాగ్‌ కోసం క్లిక్‌  చేయండి

3.తెరాస ప్రతిపాదనలతోనే అంతర్జాతీయ అవార్డులు: శ్రీనివాస్‌గౌడ్‌ 

ఎంతో చరిత్ర ఉన్న రామప్ప ఆలయానికి తెరాస హయాంలోనే యునెస్కో గుర్తింపు వచ్చిందని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. భూదాన్‌ పోచంపల్లికీ రాష్ట్ర ప్రభుత్వ కృషి వల్లే ఐరాస అవార్డు దక్కిందని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్‌ పోచంపల్లిని ఐరాస ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీవో) ఉత్తమ పర్యాటక గ్రామంగా నిన్న ఎంపిక చేసిన నేపథ్యంలో మంత్రి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.

4.గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు అస్వస్థత

ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. దిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న ఆయన రెండు రోజులుగా దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయించారు.

5.17వ రోజుకు చేరిన అమరావతి ‘మహాపాదయాత్ర’
న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర 17వ రోజుకు చేరుకుంది. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు చేస్తున్న యాత్ర ఇవాళ ప్రకాశం జిల్లా కందుకూరులోని వెంగమాంబ కల్యాణ మండపం నుంచి ప్రారంభమైంది.

6.కొత్తగా 10 వేలకుపైగా కేసులు.. సగానికిపైగా ఆ రాష్ట్రం నుంచే..

దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. స్వల్ప హెచ్చుతగ్గులతో రోజువారీ కేసులు వెలుగుచూస్తున్నాయి. ముందురోజు 10 వేల దిగువన నమోదైన కొత్త కేసులు.. తాజాగా 15 శాతం మేర పెరిగాయి. మంగళవారం 12,42,177 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 10,197 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది.

7.పాకిస్థాన్‌.. పీవోకేను ముందు ఖాళీ చెయ్యి..!

ఐరాస భద్రతా మండలిలో భారత్‌ మరోసారి పాకిస్థాన్‌ వాదనను తిప్పికొట్టింది. కశ్మీర్‌ విషయంపై భారత ప్రతినిధి మాట్లాడుతూ.. తొలుత పాక్‌ దళాలు ఆక్రమిత కశ్మీర్‌ను ఖాళీ చేయాలని డిమాండ్‌ చేశారు. ‘‘పాక్‌ చేసిన హాస్యాస్పద ఆరోపణలపై స్పందించేందుకు మరోసారి మీ ముందుకు రావాల్సి వచ్చింది. నేను ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకొన్నాను.

8.నిన్న విలియమ్సన్‌.. నేడు జేమీసన్.. టీ20 సిరీస్‌కు దూరం

 భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగనున్న టీ20 సిరీస్‌కు మరో కివీస్‌ ఆటగాడు దూరమయ్యాడు. నవంబర్‌ 25 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్ దృష్ట్యా కివీస్‌ బౌలర్ కౌల్ జేమీసన్‌కు కూడా టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. ఇంతకు ముందే, న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్ విలియమ్సన్ కూడా ఇదే కారణంతో టీ20 సిరీస్‌కు దూరమైన విషయం  తెలిసిందే.

9.నాకు సొంత ఇల్లు లేదు.. ఆ డబ్బునే పునీత్‌ కోసం వాడతా: విశాల్‌

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 16 సంవత్సరాలైనప్పటికీ తనకు సొంత ఇల్లు లేదని నటుడు విశాల్‌ అన్నారు. కర్ణాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పునీత్‌ సంస్మరణ సభలో దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు పాల్గొన్నారు. పునీత్‌తో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకొని.. ఆయన చేసిన మంచి పనులను గుర్తు చేసుకున్నారు.

10.చిన్న మదుపర్లకు రక్షణగా ఐపీఓలపై సెబీ నిబంధనలు!

న్న మదుపర్ల రక్షణార్థం ఐపీఓలపై మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబీ కొన్ని నిబంధనలు ప్రతిపాదించింది. ముఖ్యంగా పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల వినియోగంలో జవాబుదారీతనం, పారదర్శకతను తీసుకొచ్చే దిశగా చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. అలాగే యాంకర్‌ ఇన్వెస్టర్లపైనా కొన్ని షరతులు విధించాలని భావిస్తోంది.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని