Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 14 Aug 2022 13:13 IST

1. ప్రముఖ వ్యాపారవేత్త రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణం

ప్రముఖ వ్యాపారవేత్త, స్టాక్‌మార్కెట్‌ దిగ్గజం రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా (62) కన్నుమూశారు. ముంబయిలో గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో సహా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొన్ని వారాల క్రితం ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్ఛార్జి అయ్యారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఈ ఉదయం 6.45 నిమిషాలకు కుటుంబసభ్యులు ముంబయిలోని బ్రీచ్‌ కాండీ ఆస్పత్రికి తరలించారు. అయితే.. వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు ధ్రువీకరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఆయన జీవితమే ఓ ఆర్థిక మంత్రం..!

2. మాట్లాడుతున్న రష్దీ.. వెంటిలేటర్‌ తొలగించిన వైద్యులు!

దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడిన బుకర్‌ ప్రైజ్‌ విజేత, ప్రముఖ రచయిత సల్మాన్‌ రష్దీ ఆరోగ్యం కాస్త మెరుగుపడినట్లు ఆయన సన్నిహితుడు ఆండ్రూ వైలీ తెలిపారు. ఆయనకు వెంటిలేటర్‌ తొలగించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రష్దీ మాట్లాడుతున్నారని వెల్లడించారు. అయితే, విషమ పరిస్థితుల నుంచి ఇంకా బయటపడలేదని.. వైద్యుల నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. 6కి.మీ మేర భక్తుల బారులు!

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గత ఐదు రోజులుగా వరుస సెలవులు, వివాహాల నేపథ్యంలో భక్తులు తిరుమలకు అధికంగా తరలివస్తున్నారు. శనివారం రాత్రి నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఆరు కిలోమీటర్లకు పైగా క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు, క్యూలైన్లు సేవాసదన్‌ దాటి రింగ్‌రోడ్డుకు వరకు భక్తుల క్యూ చేరుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. హోమ్‌ స్క్రీన్‌లో గూగుల్‌ పాస్‌వర్డ్ మేనేజర్‌.. ఇక ఆ చింతక్కర్లేదు!

బ్యాంకు లావాదేవీలైనా, నగదు చెల్లింపులైనా, కొనుగోళ్లయినా అన్నీ ఉన్నచోటు నుంచే ఆన్‌లైన్‌లో కానిచ్చేస్తున్నాం. వీటి లాగిన్‌ సమాచారం ఇతరులు యాక్సెస్‌ చేయకుండా యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ ఏర్పాటు చేస్తున్నాం. మరోవైపు యూజర్‌ డేటా కోసం సైబర్‌ దాడులు జరుగుతున్నాయి. వీటి బారి నుంచి కాపాడుకునేందుకు చాలా మంది పాస్‌వర్డ్‌ మేనేజర్లను వినియోగిస్తుంటారు. వాటిలో గూగుల్ పాస్‌వర్డ్‌ మేనేజర్‌  కూడా ఒకటి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆ నదిపై నిర్మాణాలొద్దు.. జగన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్‌ లేఖ

కుశస్థలి నదిపై జలాశయాల నిర్మాణాలు చేపట్టవద్దంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని తమిళనాడు సీఎం స్టాలిన్‌ కోరారు. ఈ మేరకు శనివారం లేఖ రాశారు. ‘కుశస్థలి నదిపై చిత్తూరు జిల్లాలో 2చోట్ల రిజర్వాయర్ల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ఆమోదించినట్లు తెలిసింది. అదే జరిగితే చెన్నై, పరిసర ప్రాంతాల ప్రజల తాగు, సాగు నీటిపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా చెన్నైకు తాగునీటి వనరుగా ఉన్న పూండి రిజర్వాయరు ఇన్‌ఫ్లోపై ప్రభావం చూపుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కలిసుంటానని చెప్పి.. కోర్టు ఆవరణలోనే భార్య గొంతు కోసి..

6. చీనాబ్‌ రైలుమార్గ వంతెనలో సిద్ధమైన గోల్డెన్‌ జాయింట్‌

ప్రపంచంలో అత్యంత ఎత్తైనదిగా నిలిచే జమ్ము-కశ్మీర్‌లోని చీనాబ్‌ వంతెనలో కీలక భాగం సిద్ధమైంది. ‘గోల్డెన్‌ జాయింట్‌’గా పిలిచే ఈ భాగంతో వంతెనలో దాదాపు 98% పనులు పూర్తయినట్లే. చినాబ్‌ నదీ గర్భానికి 359 మీటర్ల ఎత్తున ఉండే ఈ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనదన్న విషయం తెలిసిందే. రూ.1,250 కోట్ల ఖర్చుతో దీనిని చేపట్టారు. గోల్డెన్‌ జాయింట్‌ పూర్తయిన సందర్భంగా స్థానికులు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవారు జాతీయ గీతాలు ఆలపిస్తూ, భారత్‌ మాతా కీ జై అనే నినాదాలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సచిన్‌ తొలి సెంచరీ రుచి చూసిన వేళ..!

పరుగుల వరద ఎప్పుడు మొదలుపెట్టామన్నది కాదు.. ప్రపంచ రికార్డులు దాసోహమయ్యాయా లేదా అన్నదే ముఖ్యం.. అన్నట్లు సాగింది మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ కెరీర్‌. చాలా మంది క్రికెటర్లతో పోల్చుకొంటే సచిన్‌ తొలి శతకం కొంచెం ఆలస్యమే అయ్యింది. కానీ, తొలి శతకం తర్వాత.. వేటకు దిగిన పులిలా బౌలర్లపై విరుచుకు పడటం మొదలైంది. 24 ఏళ్ల ఆయన కెరీర్‌లో 200 టెస్టు మ్యాచ్‌లు, 463 వన్డేలు ఆడారు. శతకాల వేటలో తనకు తానే సాటి అన్నట్లు 51 టెస్టు సెంచరీలు.. 49 వన్డే శతకాలతో ప్రపంచ రికార్డునే సృష్టించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8.  త్రివర్ణ దుస్తుల్లో ఫ్యాషన్‌ షో

బేగంపేటలోని కంట్రీ క్లబ్‌లో నిర్వహించిన త్రివర్ణ దుస్తుల ఫ్యాషన్‌ షో ఆకట్టుకుంది. పలువురు రూపదర్శినులు జాతీయ పతాకంలోని రంగులతోపాటు, సరిహద్దుల్లోని సైనికుల దుస్తులను ధరించి ర్యాంప్‌ వాక్‌ చేశారు. ఫొటో గ్యాలరీ కోసం క్తిక్‌ చేయండి.

9. ఆస్కార్‌లోనూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హవా కొనసాగుతుంది..

 మోస్ట్‌ ఎవైటెడ్‌ ప్రాజెక్ట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన భారతీయ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR). ఇప్పటివరకూ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ వర్షం కురిపించిన ఈ సినిమా త్వరలోనే ప్రతిష్ఠాత్మక ‘ఆస్కార్‌’ అవార్డుల్లోనూ హవా కొనసాగించనుందని ఓ ప్రముఖ హాలీవుడ్‌ మ్యాగజైన్‌ పేర్కొంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు విభాగాల్లో ఈ సినిమా పోటీ పడే అవకాశం ఉందంటూ కథనాలు ప్రచురించింది. ఇది చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నందమూరి వంశానికే ఆ ఘనత దక్కుతుంది: బాలకృష్ణ

10. క్షణం ఆలస్యమైనా పాము కాటేసేదే..! అంతలో ఏం జరిగిందంటే

ఓ ఇంటి బయటి చివరి మెట్టు కింది అంచున నాగుపాము నెమ్మదిగా పాకుతోంది. అప్పుడే తల్లితో కలిసి ఇంటి నుంచి బయటకు వస్తున్న ఆ బాలుడికి ఈ విషయం తెలియదు. దీంతో ఎప్పటిలాగే కింద అడుగేశాడో లేదో.. చప్పున వెనక్కు మళ్లిందా సర్పం. అంతలోనే బాలుడు తిరిగి వెనక్కి రావడంతో.. ఒక్కసారిగా పడగ విప్పిన సర్పం బుసలు కొడుతూ అతని వైపు వచ్చింది. ఇది గమనించిన బాలుడి తల్లి వెంటనే అప్రమత్తమై అతన్ని వెనక్కి లాగడం.. అంతా క్షణాల్లో జరిగిపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని