Rakesh Jhunjhunwala: ప్రముఖ వ్యాపారవేత్త రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణం

ప్రముఖ వ్యాపారవేత్త రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా (62) కన్నుమూశారు. ముంబయిలో అనారోగ్య కారణాలతోనే

Updated : 14 Aug 2022 11:20 IST

ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త, స్టాక్‌మార్కెట్‌ దిగ్గజం రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా (62) కన్నుమూశారు. ముంబయిలో గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో సహా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొన్ని వారాల క్రితం ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్ఛార్జి అయ్యారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఈ ఉదయం 6.45 నిమిషాలకు కుటుంబసభ్యులు ముంబయిలోని బ్రీచ్‌ కాండీ ఆస్పత్రికి తరలించారు. అయితే.. వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

రాకేశ్‌ను ‘బిగ్‌ బుల్‌’, ‘వారెన్‌ బఫేట్‌ ఆఫ్‌ ఇండియా’ అని పిలుస్తుంటారు. ఝున్‌ఝున్‌వాలా మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని