Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. 6న తెలంగాణ బడ్జెట్.. అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఇవాళ తెలంగాణ శాసనసభ, శాసనమండలిలో చర్చ జరుగుతోంది. రెండు సభల్లోనూ ఇవాళ ప్రశ్నోత్తరాలను రద్దు చేసి నేరుగా చర్చలోకి వెళ్లారు. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తీర్మానాన్ని ప్రతిపాదించగా.. మరో శాసనసభ్యుడు వివేకానంద గౌడ్ బలపరిచారు. మండలిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదించగా.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. సజ్జల గుర్తుపెట్టుకో.. నాకు ఫోన్‌కాల్స్ వస్తే మీకు వీడియో కాల్స్ వస్తాయ్: కోటంరెడ్డి
అధికార వైకాపా నుంచి దూరంగా జరగాల్సిన పరిస్థితుల్లో.. మౌనంగా ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లాలనుకున్నట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. అయితే, పార్టీకి చెందిన 13 మంది మంత్రులు, సలహాదారులు, ప్రాంతీయ కో-ఆర్డినేటర్లు తన వ్యక్తిత్వాన్ని అనుమానించే రీతిలో మాట్లాడుతుంటే తప్పని పరిస్థితుల్లో స్పందిస్తున్నట్లు ఆయన చెప్పారు. నెల్లూరులో కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్రాప్‌లో పడి అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని తనపై మంత్రి కాకాణి చేసిన విమర్శలకు ఆయన ఘాటుగా సమాధానమిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. మహేశ్‌బాబు సినిమా ఆడిషన్.. ఏడ్చుకుంటూ వచ్చేశా: సమీరారెడ్డి
‘నరసింహుడు’ (Narasimhadu)తో తెలుగువారికి పరిచయమైన ముంబయి భామ సమీరారెడ్డి (Sameera Reddy). గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ నటి తాజాగా తన కెరీర్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. గతంలో తాను సూపర్‌స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) సినిమా కోసం ఆడిషన్ ఇచ్చినట్లు చెప్పింది. అయితే అందులో సరిగా చేయలేక ఆరోజు కన్నీళ్లతో ఇంటికి వెళ్లిపోయినట్లు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. ఘోరం.. వ్యాధి తగ్గాలని 3 నెలల చిన్నారికి 51 సార్లు కాల్చి వాతలు..!
సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లోనూ ఇంకా కొందరు మూఢనమ్మకం అనే మనోవ్యాధి నుంచి బయటపడలేకపోతున్నారు. ఇంకా నాటు వైద్యం చేయించుకుంటూ ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ మూడు నెలల పసికందు.. ఇలాంటి మూఢనమ్మకానికి బలైంది. వ్యాధి తగ్గాలని ఆ లేత శరీరంపై 51సార్లు ఇనుప రాడ్డుతో కాల్చి వాతపెట్టారు. దీంతో అభం శుభం తెలియని ఆ చిన్నారి పదిహేను రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. భూమా అఖిలప్రియ గృహ నిర్బంధం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. భూమా అఖిలప్రియను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి అక్రమాలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని అఖిలప్రియ వెల్లడించిన విషయం తెలిసిందే. నంద్యాల గాంధీ చౌక్ వద్దకు వస్తే ఆధారాలు బహిర్గతం చేస్తానని.. అక్కడికి రావాలంటూ రవిచంద్రకిశోర్‌రెడ్డికి ఆమె సవాల్ విసిరారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. గుబులుపుట్టిస్తున్న చైనా నిఘా నీడ.. లాటిన్ అమెరికాలో కన్పించిన రెండో బెలూన్
చైనా (China)కు చెందిన నిఘా బెలూన్లు అగ్రరాజ్యం అమెరికా (America)ను గుబులుపుట్టిస్తున్నాయి. గురువారం మోంటానా రాష్ట్ర గగనతలంలో ఓ భారీ బెలూన్ (Spy Balloon) కన్పించగా.. తాజాగా లాటిన్ అమెరికాలో మరో దాన్ని గుర్తించినట్లు పెంటగాన్ శుక్రవారం రాత్రి వెల్లడించింది. ‘‘లాటిన్ అమెరికా (Latin America) గగనతలం మీదుగా ఓ బెలూన్ ప్రయాణిస్తున్నట్లు సమాచారం అందింది. అది చైనాకు చెందిన మరో గూఢచర్య బెలూన్ అని మేం అంచనా వేస్తున్నాం. ప్రస్తుతానికి ఇంతకంటే సమాచారం లేదు’’ అని పెంటగాన్ మీడియా కార్యదర్శి బ్రిగేడియర్ జనరల్ ప్యాట్ రైడర్ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. రోహిత్, విరాట్.. ఇద్దరూ టీ20 ప్రపంచకప్‌లో ఆడడం కష్టమే..!: వసీం జాఫర్
భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల టీ20 భవిష్యత్తుపై భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వారిద్దరూ టీ20 ప్రపంచకప్‌లో ఆడే అవకాశాలు చాలా తక్కువని అభిప్రాయపడ్డాడు. కొన్నేళ్లుగా వారిద్దరూ భారత జట్టుకు గొప్పగా సేవలందించారని తెలిపాడు. అయితే వారి వయసు, ఫామ్‌ని బట్టి భవిష్యత్తులో టీ20 ప్రపంచకప్ ఆడతారా అనేది ప్రశ్నగా మారిందన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. చిలీలో కార్చిచ్చు.. రోడ్లపైకి దూసుకొస్తున్న అగ్నికీలలు..13 మంది మృతి
లాటిన్ అమెరికా దేశం చిలీ(Chile) కార్చిచ్చు(wildfire)లో చిక్కుకుపోయింది. అక్కడి అటవీ ప్రాంతాల్లో అగ్ని కీలలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. రహదారుల మీదకు దూసుకొస్తున్నాయి. వేడిగాలుల ఎఫెక్ట్‌తో వేల ఎకరాలు దగ్ధమవుతున్నాయి. వీటిని అదుపులోకి తెచ్చే క్రమంలో.. అలాగే వీటి నుంచి బయటపడే ప్రయత్నంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. చాట్‌జీపీటీ సంచలనం.. రెండు నెలల్లోనే 100 మిలియన్ యూజర్లు
సాంకేతిక యుగంలో సరికొత్త సంచలనమైన చాట్‌జీపీటీ (ChatGPT) అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. కృత్రిమమేధ (AI) ఆధారంగా పనిచేసే ఈ యాప్ ప్రపంచంలోనే వేగంగా విస్తరిస్తున్న యాప్‌గా అవతరించింది. ఈ చాట్‌బోట్ (chatbot) కేవలం 2 నెలల్లోనే 100 మిలియన్ యూజర్లను సొంతం చేసుకుంది. చాట్‌బోట్ జనవరిలో రోజుకు 13 మిలియన్ల మంది వినియోగదారులను సంపాదించుకుంది. ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ సహా ఇతర సోషల్‌మీడియా యాప్‌లను అధిగమించి తక్కువ సమయంలోనే 100 మిలియన్ యూజర్లను దక్కించుకున్న యాప్‌గా ఘనత సాధించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. ఆస్ట్రేలియా జట్టులో కంగారు మొదలైంది..: మహమ్మద్ కైఫ్
నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 9వ తేదీ నుంచి భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ (Test Match) ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్యాట్ కమిన్స్ నాయకత్వంలోని ఆసీస్ తమ ప్రాక్టీస్‌ను మొదలెట్టేసింది. భారత స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా (Australia) బ్యాటర్లు తెగ కష్టపడిపోతున్నారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు చేరుకోవడానికి ఇరు జట్లకూ ఇది కీలకమైన టెస్టు సిరీస్ కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Andhra News: జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం: మంత్రి బొత్స
-
India News
Jaishankar: విదేశాల్లో భారత్‌ను విమర్శించడం.. రాహుల్ గాంధీకి అలవాటే!
-
Movies News
Chiranjeevi: ‘భోళా శంకర్’ నుంచి మరో లీక్.. ఫ్యాన్స్‌తో షేర్ చేసిన చిరు
-
General News
GPS: జీపీఎస్ మార్గదర్శకాలు వెల్లడించాలి: సీపీఎస్ అసోసియేషన్ డిమాండ్
-
Politics News
TDP: మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయి.. గవర్నర్‌కు తెదేపా ఫిర్యాదు
-
Crime News
Mumbai Murder: దుర్వాసన వస్తుంటే.. స్ప్రేకొట్టి తలుపుతీశాడు: ముంబయి హత్యను గుర్తించారిలా..!