Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు...

Updated : 05 Mar 2023 17:12 IST

1. గవర్నర్‌, కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు వరుస ట్వీట్లు

వైద్య కళాశాలల (Medical colleges) కేటాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) ఆరోపించారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విన్నవించినా తెలంగాణకు ఒక్క కాలేజీ కూడా కేటాయించలేదని ధ్వజమెత్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ప్రధానికి 9 మంది విపక్ష నేతల లేఖ

ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత మనీశ్‌ సిసోదియా (Manish Sisodia) అరెస్టును ఖండిస్తూ తొమ్మిది మంది విపక్ష పార్టీల నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (modi)కి లేఖ రాశారు. దేశం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం వైపు పయనిస్తోందని లేఖలో ఆరోపించారు. ప్రతిపక్షాలపై ఇలాంటి చర్యలకు దిగడం నిరంకుశత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఇందౌర్ పిచ్‌కు ‘పేలవం’ రేటింగ్‌.. అదే కదా వారి పని: ఆసీస్‌ కోచ్‌

బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ (Border - Gavaskar Trophy)లో భాగంగా భారత్ - ఆస్ట్రేలియా (IND vs AUS) జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు వేదిక ఇందౌర్‌ పిచ్‌కు  ఐసీసీ (ICC) ‘పేలవ’ రేటింగ్‌ను ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఐసీసీ తీరుపై టీమ్‌ఇండియా (Team India) దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇందౌర్‌కు మూడు డీమెరిట్‌ పాయింట్లు ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేస్తూ.. గబ్బా పిచ్‌పైనా ప్రశ్నలు సంధించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సమంతతో మాట్లాడుతుంటా: రానా

వీలు కుదిరినప్పుడల్లా నటి సమంత(Samantha)తో తాను మాట్లాడుతుంటానని నటుడు దగ్గుబాటి రానా (Rana) అన్నారు. సామ్‌ మయోసైటిస్‌ బారిన పడిన విషయం తెలిసిన తర్వాత.. ఆమెకు ఫోన్‌ చేసి యోగక్షేమాలు తెలుసుకున్నట్లు చెప్పారు. తన సరికొత్త వెబ్‌ సిరీస్‌ ‘రానా నాయుడు’ (Rana Naidu) ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ఇటీవల కాలంలో పలువురు నటీనటులు తమ అనారోగ్య సమస్యల గురించి వెల్లడించడంపై స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నీట్‌ పరీక్ష కేంద్రంలో కేంద్ర ఆరోగ్య మంత్రి సర్‌ప్రైజ్‌!

2023-24లో వైద్య విద్యాసంస్థల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌(పీజీ) మెడికల్‌ సీట్ల భర్తీకి ఆదివారం దేశవ్యాప్తంగా నీట్‌ పీజీ పరీక్ష జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, పంజాబ్‌లో ఉన్న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ(Mansukh Mandaviya) అక్కడ ఓ పరీక్ష కేంద్రం వద్దకు వెళ్లి అందరినీ సర్‌ప్రైజ్‌ చేశారు. పటియాలాలో నీట్‌ పీజీ(NEET PG) పరీక్ష కేంద్రం వద్దకు అకస్మాత్తుగా వెళ్లిన ఆయన అక్కడి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఉక్రెయిన్‌ పైలట్లకు అమెరికాలో శిక్షణ..!

ఉక్రెయిన్‌(Ukrain) వైమానిక దళానికి చెందిన పైలట్లకు అమెరికాలోని అరిజోనాలో ప్రత్యేక సిమ్యూలేటర్లపై శిక్షణ ఇస్తున్నారు. ఈ విషయాన్ని అమెరికా రక్షణ అధికారులు కూడా ధ్రువీకరించారు. దీంతో అమెరికా(USA) నుంచి యుద్ధ విమానాలు కూడా సాయం రూపంలో ఉక్రెయిన్‌(Ukrain)కు అందనున్నాయనే ప్రచారం జరుగుతోంది. కానీ, వాషింగ్టన్‌ మాత్రం ఈ విషయంపై మౌనంగా ఉంటోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కరవులో ఉన్న పాక్‌కు భారత నౌక ద్వారా గోధుమల సరఫరా

తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, ఆహార ధాన్యాల కరువులో ఉన్న పాకిస్థాన్‌(Pakistan )కు ఓ భారత నౌక కొంత ఉపశమనం కల్పించింది. భారతీయుడికి చెందిన ఓ నౌక రష్యా(Russia) నుంచి 50,000 మెట్రిక్‌ టన్నుల గోధుములను సరఫరా చేసింది. ప్రస్తుతం 40శాతం ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న పాకిస్థాన్‌కు ఇది పెద్ద ఊరట. రష్యా నుంచి 4.5లక్షల టన్నుల గోధుమలను దిగుమతి చేసుకొనేందుకు పాక్‌ కన్సైన్‌మెంట్‌ కుదుర్చుకొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. యుద్ధానికి సిద్ధంగా ఉండండి.. రక్షణ బడ్జెట్‌ పెంచనున్న చైనా

చైనా రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ సారి పెంపు 7.2 శాతంగా ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. దీంతో ఇది 230 బిలియన్‌ డాలర్లకు చేరుతుంది. ఈ మేరకు చైనా ఆర్థిక శాఖ ముసాయిదాను విడుదల చేసింది. చైనా రక్షణ బడ్జెట్‌ పెంపు వరుసగా ఇది 8వసారి. చైనా ఆర్థిక వృద్ధి రేటు కంటే రక్షణ బడ్జెట్‌ పెంపు రేటు అధికంగా ఉండటం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. విరాట్‌ను పొగిడేందుకు ఇదే కారణం.. షోయబ్‌ అక్తర్ ఆసక్తికర సమాధానం

దాదాపు మూడేళ్ల తర్వాత టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ (Virat Kohli) సెంచరీ సాధించి మరీ  ఫామ్‌లోకి దూసుకొచ్చాడు. ప్రస్తుతం ఆసీస్‌తో టెస్టు (IND vs AUS) సిరీస్‌ మినహా.. గతేడాది ఆసియా కప్‌ నుంచి మొన్న కివీస్‌ వన్డే సిరీస్‌ వరకు అదరగొట్టేశాడు. 34 ఏళ్ల వయసులో ఫామ్ తిరిగి అందుకోవడం అసాధారణమైన విషయమని క్రికెట్ విశ్లేషకులు అంటుంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. తోషాఖానా కేసులో ఇమ్రాన్‌ అరెస్టుకు యత్నం.. లాహోర్‌లో ఉద్రిక్తత

పాక్‌ (pakistan)మాజీ ప్రధాని, తెహ్రీక్‌ -ఏ- ఇన్సాఫ్‌ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌(Imran Khan)ను అరెస్టు చేసేందుకు పోలీసులు ఆయన ఇంటికి చేరుకోవడం లాహోర్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. తోషాఖానా (కానుకల భాండాగారం) కేసుకు సంబంధించి అరెస్టు వారెంట్‌తో నేటి ఉదయం లాహోర్‌లోని జమాన్‌ పార్క్‌ ప్రాంతంలోని ఇమ్రాన్‌ ఖాన్‌ ఇంటి వద్దకు పోలీసులు చేరుకొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని