Updated : 17/11/2021 09:11 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. దేవుడా...ఈ వానలేంది..!?

అకాల వర్షాలు అన్నదాతలకు తీవ్ర ఆవేదన మిగిల్చాయి. రాష్ట్రంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పైర్లు దెబ్బతిని, కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన పంటలు తడిచిపోయి రైతులు నష్టపోయారు. సోమవారం సాయంత్రం పలుచోట్ల భారీ వర్షాలు పడడంతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరిధాన్యం నీటిలో మునిగింది. కొన్నిచోట్ల వర్షపు నీటితో పాటు ధాన్యం కొట్టుకుపోతుంటే దాన్ని కాపాడుకోవడానికి రైతులు అగచాట్లు పడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను గ్రామ శివార్లలో పొలాల్లోనే ఎక్కడపడితే అక్కడ ఏర్పాటుచేయడం వల్ల చిన్న వర్షం పడినా ..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Trains: ఇక పాత నంబర్లతోనే రైళ్లు

ప్రత్యేక రైళ్లను ఇక కొవిడ్‌కు ముందు మాదిరిగానే నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ప్రకటించింది. ‘ప్రత్యేక’ నంబర్లను తొలగించి పాత నంబర్లను కేటాయించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ‘రైల్వే కాలపట్టిక- 2021’లో సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌ అప్‌లోడ్‌ చేసింది. ఇప్పటికే టికెట్లు రిజర్వు చేసుకున్న ప్రయాణికులకు మారిన రైలు నంబర్ల వివరాల్ని ఎస్‌ఎంఎస్‌ల రూపంలో పంపించింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Rohit Sharma: రోహిత్‌కు తొలి పరీక్ష 

కెప్టెన్‌ రోహిత్‌, కోచ్‌ ద్రవిడ్‌ హయాంలో తొలి సమరానికి భారత జట్టు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగే మొదటి టీ20లో భారత్‌.. న్యూజిలాండ్‌ను ఢీకొంటుంది. టీ20 జట్టులో ప్రక్షాళన అవసరమని తాజా ప్రపంచకప్‌తో తెలిసొచ్చిన నేపథ్యంలో.. రోహిత్‌, ద్రవిడ్‌ ద్వయం ఏడాదిలో ఆస్ట్రేలియాలో జరిగే మరో పొట్టి ప్రపంచకప్‌ కోసం జట్టును ఎలా సిద్ధం చేస్తారన్నది ఆసక్తికరం.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Rahul Dravid: కొత్త కొత్తగా.. 

4. AP News: ‘పుర’ ఓట్ల లెక్కింపు ప్రారంభం 

ఏపీలోని నెల్లూరు నగరపాలక సంస్థ, కుప్పం సహా 12 మున్సిపాలిటీలతో పాటు సోమవారం పోలింగ్‌ జరిగిన అన్ని చోట్ల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కుప్పం మున్సిపాలిటీని అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ మున్సిపాలిటీ ఫలితంపై ఆసక్తి నెలకొంది. నెల్లూరు నగరపాలక సంస్థతో సహా రాష్ట్రంలోని వివిధ నగరపాలక సంస్థల పరిధిలోని డివిజన్లలో పోలైన ఓట్లను కూడా లెక్కిస్తున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఇంటర్‌ పరీక్షల కాలపట్టికలో మార్పు!

 ఇంటర్మీడియట్‌ పరీక్షల కాలపట్టిక మారే అవకాశం ఉంది. వచ్చే మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 14వ తేదీ వరకు వార్షిక పరీక్షలు జరుపుతామని గత సెప్టెంబరులో విడుదల చేసిన విద్యా క్యాలెండర్‌లో ఇంటర్‌బోర్డు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు జరగడం, జవాబుపత్రాల మూల్యాంకనం కారణంగా కొద్ది రోజులపాటు తరగతులు జరగలేదు. ఈ క్రమంలో సిలబస్‌ పూర్తికాదని భావిస్తున్న ఇంటర్‌బోర్డు గతంలో ప్రకటించిన వార్షిక పరీక్షల కాలపట్టికలో మార్పులు చేయనుందని సమాచారం.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. రెండో చెంప చూపిస్తే దక్కేది భిక్షే!

తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ మంగళవారం మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. మహాత్మాగాంధీని లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెట్టారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌, భగత్‌ సింగ్‌లకు అప్పట్లో గాంధీ నుంచి మద్దతు లభించలేదని పేర్కొన్నారు. ‘‘ఒక చెంప మీద కొడితే రెండోది చూపించాలి’’ అంటూ మహాత్మాగాంధీ ప్రవచించిన అహింస సూత్రాన్ని ఆమె ఎద్దేవా చేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. భారత్‌-పాక్‌ సరిహద్దుల సమీపానికి వెళ్లొద్దు

భారత్‌, పాకిస్థాన్‌లకు పర్యాటకులుగా వెళ్లే అమెరికా పౌరులకు బైడెన్‌ సర్కారు లెవెల్‌ 2, 3 సూచనలు జారీచేసింది. పర్యాటకం విషయంలో భారత్‌ను లెవెల్‌ 2లో, పాక్‌ను లెవెల్‌ 3లో చేర్చింది. పాకిస్థాన్‌ వెళ్లాలనుకునే వారు, ఆ దేశంలో ఉగ్రవాదం, మతహింసల నేపథ్యంలో పర్యటన విషయాన్ని పునరాలోచించాలని కోరింది. భారత్‌ వెళ్లేవారు.. నేరాలు, ఉగ్రవాదం నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని, పర్యాటక ప్రాంతాల్లో లైంగిక వేధింపుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* అమెరికాను మించిన చైనా!

8. Azadi Ka Amrit Mahotsav: ఝాన్సీ బాలుడేమయ్యాడు?

రాణీ ఝాన్సీలక్ష్మీబాయి అనగానే... వీపున చిన్నపిల్లాడితో... గుర్రంపై దూసుకెళ్తూ కత్తి ఎత్తిన బొమ్మే అందరికీ గుర్తుకొస్తుంది. 1857 తొలి స్వాతంత్య్ర సంగ్రామంలో ఝాన్సీ లక్ష్మీబాయి వీరమరణం తర్వాత మరి వీపునున్న ఆ పిల్లాడేమయ్యాడు? ఝాన్సీ వారసుడిని బ్రిటిష్‌ ప్రభుత్వం ఏం చేసింది?ఝాన్సీలక్ష్మీబాయి వీపున బొమ్మగా నిల్చిపోయిన ఆ బాలుడి పేరు దామోదర్‌రావు. 1849 నవంబరు 15న జన్మించిన ఆ కుర్రాడిని మూడేళ్ల వయసులో ఝాన్సీ మహారాజు గంగాధర్‌రావు దత్తత తీసుకున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అంతరిక్షం నుంచి నట్టింటి దాకా

అంతరిక్షమంటే మనిషికి మొదట్నుంచీ ఆసక్తే. విశ్వాంతరాళాన్ని శోధించాలని, గ్రహాంతర యానం చేయాలని ఎప్పుడూ ఉబలాటమే. ఇందుకోసం ఎంతో సాధన సంపత్తిని సమకూర్చుకుంటూ వస్తున్నాడు. అయితే వీటిల్లో కొన్ని మన నిత్య జీవితంలోనూ భాగమైపోయాయి. మౌస్‌ లేకపోతే డెస్క్‌టాప్‌తో పనిచేయటం చాలా కష్టం. అన్నిసార్లూ అందరికీ కీబోర్డుతోనే పనిచేయటం రాదుగా మరి. మొదట్లో దీన్ని వ్యోమనౌకల నియంత్రణ, సిమ్యులేషన్‌ను సులభం చేయటానికే రూపొందించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మందుల్లేకుండానే హెచ్‌ఐవీ నుంచి విముక్తి!

హెచ్‌ఐవీ సోకినట్టు తెలిస్తే చాలు... మనసులో అలజడి, సమాజంలో ఛీత్కారాలు! బతుకుపై ఆశతో బాధితులు వైరస్‌తో సహజీవనం చేస్తూనే, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు యాంటీ-రిట్రోవైరల్‌ డ్రగ్స్‌ వాడుతుంటారు. కానీ, తాజాగా ఓ వ్యక్తి ఎలాంటి ఔషధాలను వాడకుండానే... హెచ్‌ఐవీ నుంచి విముక్తి పొందాడు! ఈ తరహా కేసుల్లో ఇది రెండోది కావడం విశేషం. వీరిద్దరిలో వైరస్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక వ్యవస్థలు ఎలా పనిచేశాయన్న రహస్యాన్ని తెలుసుకోగలిగితే... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కుకీ లేడీగా ఎదగాలని...

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని