Updated : 04/12/2021 09:26 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. Konijeti Rosaiah: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. ఈ ఉదయం ఇంట్లో పల్స్‌ పడిపోవడంతో కుటుంబ సభ్యులు రోశయ్యను నగరంలోని స్టార్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస వదిలారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఓటీఎస్‌.. కట్టించాల్సిందే!

పశ్చిమగోదావరి జిల్లా వెంకటాపురం పరిధిలోని కొత్తూరు ఇందిరమ్మ కాలనీ ఇది.. రెండు వేలకుపైగా పేద కుటుంబాలు ఉంటున్న ఈ కాలనీకి 2004-05లో అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో గృహనిర్మాణ సంస్థ అందించిన సొమ్ముతో లబ్ధిదారులు ఇళ్లు కట్టుకున్నారు. ఇన్నాళ్లూ ఇంటిని తమ సొంతమనే భావిస్తున్నామని, ఇప్పుడు ఉన్నట్లుండి అధికారులు వచ్చి ‘మీ పేరిట అప్పుంది... కట్టాలి’ అంటున్నారని వాపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Crypto Currency: క్రిప్టో కరెన్సీ కాదు.. క్రిప్టో అసెట్‌

క్రిప్టో కరెన్సీని ‘క్రిప్టో అసెట్‌’గా పేరు మార్చడంతో పాటు, మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ పరిధిలోకి దీనిని తీసుకురావాలని మోదీ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించిందని సమాచారం. అంటే సెబీ దగ్గర నమోదైన ప్లాట్‌ఫాంలు, ఎక్స్ఛేంజీల ద్వారా మాత్రమే క్రిప్టో లావాదేవీలు జరగాలి. సెబీ వద్ద నమోదు కావడానికి ప్రస్తుత క్రిప్టో ఎక్స్ఛేంజీలకు గడువు తేదీని కూడా ప్రకటించనున్నారు. ఇవన్నీ అమల్లోకి రావడానికి వీలుగా ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఒక బిల్లును ప్రతిపాదించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అత్యున్నతాధికారి తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అలా అరిచే సరికి షాకయ్యా..

‘‘పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు పరిపూర్ణమైన జీవన ప్రయాణం గురించి చెప్పే సినిమానే ఈ ‘గమనం’’ అన్నారు దర్శకురాలు సుజనా రావు. ఆమె తెరకెక్కించిన తొలి చిత్రమిది. శ్రియ, ప్రియాంక జవాల్కర్‌, శివ కందుకూరి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈనెల 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు సుజనా రావు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Omicron: గతంలోనే కరోనా సోకినా.. ఒమిక్రాన్‌తో ముప్పే!

గతంలో కరోనా బారిన పడ్డవారికి ప్రస్తుతం ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకదని అపోహపడొద్దని తాజా అధ్యయనమొకటి హెచ్చరించింది. మునుపటి ఇన్‌ఫెక్షన్‌ తాలూకు రక్షణ వ్యవస్థను కొత్త వేరియంట్‌ తప్పించుకోగలుగుతోందని పేర్కొంది. ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో విట్‌వాటర్స్‌రాండ్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. అంతకుముందే కరోనా బారిన పడ్డవారికి.. డెల్టా సహా ఇతర వేరియంట్లు సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు వారు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఎలుకల్లో ఒమిక్రాన్‌ వృద్ధి!

6. Cyclone Jawad: తీవ్ర తుపానుగా దూసుకొస్తున్న ‘జవాద్‌’

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న జవాద్ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారిందని భారత వాతావరణశాఖ(ఐఎండీ) తెలిపింది. ప్రస్తుతం ఇది విశాఖకు ఆగ్నేయంగా 250 కిలోమీటర్ల దూరంలో, పారదీప్‌కు 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడచిన కొద్దీ గంటలుగా తుపాను వాయువ్య దిశలో గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. క్రమంగా దిశ మార్చుకుని రేపు మధ్యాహ్ననికి పూరీ తీరానికి చేరువగా వెళ్లే అవకాశం ఉందని ఐంఎండీ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. CM Jagan: 5 రోజులు కోర్టుకొస్తే పాలనకు ఇబ్బంది

సీబీఐ నమోదు చేసిన కేసుల విచారణ నిమిత్తం వారానికి 5 రోజులు కోర్టుకు హాజరైనట్లయితే రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఆగిపోతాయని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. రోజువారీ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి పనులకూ ఆటంకమన్నారు. హాజరు మినహాయింపుపై వేసిన పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టివేయడంతో జగన్‌ హైకోర్టులో పిటిషన్లు వేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. విలన్‌లా చూపుతారా!

 కోర్టుల్లో జరుగుతున్న వాదనలను కొన్ని పత్రికలు వక్రీకరిస్తుండడాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం ఆక్షేపించింది. తమను విలన్లు మాదిరిగా చూపిస్తున్నారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. దిల్లీ, పొరుగు రాష్ట్రాల్లో వాయు కాలుష్యంపై దాఖలైన వ్యాజ్యంపైన విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్య చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. దేవుడినే దెయ్యమయ్యానా..?

క్లాసులు బంక్‌ కొట్టడం.. గొడవల్లో తలదూర్చడం.. డిగ్రీలో ఇదీ నా దినచర్య. నేనో మొరటోడినని అందరి అభిప్రాయం. నా మనసెంత సున్నితమో వాళ్లకేం తెలుసు? ఓరోజు క్యాంటీన్‌ నుంచి బయటికొస్తుంటే.. ఫ్రెండ్‌ ఎదురొచ్చాడు. ‘రేయ్‌.. వీళ్లిద్దరు నా ఫ్రెండ్స్‌ ఇక నుంచి నీక్కూడా’ ఇద్దరమ్మాయిల్ని పరిచయం చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Virat Kohli: కోహ్లి.. ఔటా? నాటౌటా..?

టీ20 ప్రపంచకప్‌ అనంతరం కివీస్‌తో టీ20 సిరీస్‌తో పాటు తొలి టెస్టుకు విరామం తీసుకుని మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టిన కోహ్లికి చేదు అనుభవం ఎదురైంది. రెండో టెస్టులో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో పుజారా ఔటయ్యాక క్రీజులో అడుగుపెట్టిన కోహ్లి తాను ఎదుర్కొన్న నాలుగో బంతికే ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే అతన్ని ఔట్‌గా ప్రకటించడంపై వివాదం రాజుకుంది. అజాజ్‌ బంతిని డిఫెన్స్‌ ఆడదామని కోహ్లి ప్రయత్నించాడు. కానీ బంతి ప్యాడును తాకిందని అప్పీల్‌ చేయడంతో అంపైర్‌ ఔటిచ్చాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని