Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 08 Mar 2024 21:08 IST

1. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 39 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రకటించారు. రాహుల్‌ గాంధీ మరోసారి సిటింగ్‌ స్థానం వయనాడ్‌ నుంచి పోటీ చేయనున్నారు. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉండగా.. ప్రస్తుతం 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఎంఐఎంతో కలిసి హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తాం: రేవంత్‌రెడ్డి

ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలని, మిగతా సమయాల్లో అభివృద్ధికే ప్రాధాన్యమిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కి.మీ మేర మెట్రో ప్రాజెక్టు విస్తరణకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌ అభివృద్ధికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఈ విషయంలో ఎంఐఎంతో కలిసి పనిచేస్తామని తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మార్చి 11న తెలంగాణ భాజపా రెండో జాబితా

తెలంగాణలో భాజపా లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితా మార్చి 11న విడుదల కానుంది. ఈనెల 10న దిల్లీలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై చర్చించనుంది. ఇప్పటికే 9 స్థానాలకు నేతలను ప్రకటించిన ఆ పార్టీ.. మిగిలిన స్థానాలపై నిర్ణయం తీసుకోనుంది. రెండో జాబితాలో ఆరు స్థానాలకు నేతల పేర్లను ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. హైదరాబాద్‌లో తొలి డ‌బుల్ డెక్కర్ కారిడార్‌.. విశేషాలివే!

జాతీయ ర‌హ‌దారి - 44పై రూ.1,580 కోట్ల వ్యయంతో చేప‌ట్టనున్న 5.320 కిలోమీట‌ర్ల కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శనివారం శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్‌పై త‌ర్వాత మెట్రో మార్గం నిర్మించ‌నున్నారు. కండ్లకోయ జంక్షన్‌ నుంచి తొలి డ‌బుల్ డెక్కర్ కారిడార్‌కు ప్రస్థానం ప్రారంభం కానుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పొత్తులో ఎవరికి సీటు వచ్చినా గెలిపించాలి: చంద్రబాబు

సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపికకు సంబంధించి విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకునే నిర్ణయాలను నాయకులు అర్థం చేసుకొని కలిసి పనిచేయాలని తెదేపా అధినేత చంద్రబాబు కోరారు. పార్టీ నేతలు, వివిధ నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలతో అధినేత వరుసగా చర్చిస్తున్నారు. 12 నియోజకవర్గాల నేతలతో స్వయంగా మాట్లాడి ఎన్నికలకు సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. జమిలి ఎన్నికలపై.. త్వరలో కోవింద్‌ కమిటీ నివేదిక

ఏకకాల ఎన్నికలపై (Simultaneous polls) భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ తన తుది నివేదికను సిద్ధం చేసినట్లు సమాచారం. దీనిని ప్రభుత్వానికి త్వరలో అప్పగించే పనిలో నిమగ్నమైనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండండి...: యూఎస్‌ ఎంబసీ

అమెరికా పౌరులంతా తక్షణమే రష్యాను విడిచి తమ దేశానికి వెళ్లాలని అనేకసార్లు కోరిన రష్యాలోని అమెరికా రాయబార కార్యాలయం తమ పౌరులకు తాజాగా మరిన్ని హెచ్చరికలు జారీ చేసింది.  మాస్కో(Moscow)లో ప్రజలు ఎక్కువగా గుమిగూడే పెద్ద సమావేశాలను, కచేరీలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని తెలిపింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ముగిసిన రెండో రోజు ఆట.. భారత్‌ లీడ్‌ 255

ఇంగ్లాండ్‌ బౌలర్లపై టాప్‌ -5 బ్యాటర్ల ఆధిపత్యం.. భారత టెయిలెండర్లు క్రీజ్‌లో పాతుకుపోయిన విధానం అద్భుతం. మరీ ముఖ్యంగా కుల్‌దీప్‌ యాదవ్‌ పక్కా బ్యాటర్‌గా ఆడటం విశేషం. దీంతో ఐదో టెస్టులో టీమ్‌ఇండియా భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోయింది. ఆరంభంలో ఇద్దరు సెంచరీలు.. ముగ్గురు హాఫ్ సెంచరీలు చేయడంతో బలమైన పునాది పడింది..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. భారత్‌కు అప్పుడు అన్యాయం జరిగితే.. ప్రపంచం స్పందించలేదు: జైశంకర్‌

గ్లోబల్ సౌత్‌ (Global South)లోని భాగస్వామ్య దేశాలకు భారత్‌పై నమ్మకం ఉందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్ (S Jaishankar) అన్నారు. చైనా మాత్రం ఆయా దేశాల సమస్యలు వినేందుకు గతేడాది భారత్‌ ఏర్పాటు చేసిన రెండు సమావేశాలకు రాలేదని తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పాఠశాలలపై బందిపోట్ల దాడి.. 280 మందికి పైగా చిన్నారుల కిడ్నాప్‌

నైజీరియాలోని పాఠశాలలపై సాయుధ మూకలు (Bandits) దాడి చేసి, భారీ సంఖ్యలో విద్యార్థులను అపహరించుకెళ్లారు. ఏకంగా 280 మందికిపైగా చిన్నారులను కిడ్నాప్‌ చేసినట్లు అంచనా. కడునా రాష్ట్రంలోని చికున్‌ జిల్లాలోని పాఠశాలల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. నైజీరియాలో ఇటువంటి ఘటనలు (Mass kidnapping) సాధారణమే అయినప్పటికీ.. ఇంత భారీ సంఖ్యలో విద్యార్థులను కిడ్నాప్‌ చేయడం సంచలనం రేపుతోంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు