ఆర్థిక మంత్రితో తితిదే ఛైర్మన్‌ భేటీ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత తితిదే వద్ద మిగిలిపోయిన పాత నోట్ల వ్యవహారాన్ని మరోసారి కేంద్ర మంత్రి దృష్టికి ఆయన తీసుకెళ్లారు. కేంద్రం రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లను రిజర్వు బ్యాంకు తీసుకునేలా చూడాలని ఇదివరకే ఆయన కోరారు. రూ.500 నోట్లు 6.34లక్షలు, రూ.1000

Updated : 16 Sep 2020 00:17 IST

దిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత తితిదే వద్ద మిగిలిపోయిన పాత నోట్ల వ్యవహారాన్ని మరోసారి కేంద్ర మంత్రి దృష్టికి ఆయన తీసుకెళ్లారు. కేంద్రం రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లను రిజర్వు బ్యాంకు తీసుకునేలా చూడాలని ఇదివరకే ఆయన కోరారు. రూ.500 నోట్లు 6.34లక్షలు, రూ.1000 నోట్లు రూ.1.8లక్షలు ఉన్నాయని నిర్మలా సీతారామన్‌కు సుబ్బారెడ్డి తెలిపారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత తితిదే హుండీలో పెద్దఎత్తున పాత నోట్లు బయటపడిన విషయాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌కి సమాచారం ఇచ్చినట్లు సుబ్బారెడ్డి కేంద్రమంత్రికి తెలిపారు. తితిదే ఖజానాలో ఉండిపోయిన ఈ సొమ్మును మార్చుకునేలా చర్యలు చేపట్టాలని సుబ్బారెడ్డి మంత్రిని కోరారు. అంతేకాకుండా 2014 జనవరి నుంచి 2017 జూన్‌ వరకు తితిదే చెల్లించాల్సిన రూ.23 కోట్ల సర్వీస్‌ టాక్స్‌ అరియర్స్‌ని రద్దు చేయాలని మంత్రిని కోరారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని