Nara Lokesh: నారా లోకేశ్‌పై గుడ్డు విసిరిన ఇద్దరు నిందితులు అరెస్టు
కడప జిల్లా ప్రొద్దుటూరులో నారా లోకేశ్‌పై కోడిగుడ్డు విసిరిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
ప్రొద్దుటూరు: కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈనెల 1న యువగళం పాదయాత్ర సందర్భంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై కోడిగుడ్డు విసిరిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పెన్నా నగర్‌కు చెందిన బాబు, శ్రీకాంత్‌ను అరెస్టు చేసినట్టు ఏఎస్పీ ప్రేరణ కుమార్ తెలిపారు. నిందితులు బాబు, శ్రీకాంత్ ఇద్దరూ స్నేహితులని, సెల్ఫీ ఇవ్వలేదని లోకేశ్‌పై గుడ్డు విసిరారని వెల్లడించారు. ఇద్దరు మాట్లాడుకునే గుడ్డు విసిరారని తెలిపారు.
ఒకటో తేదీ రాత్రి బహిరంగ సభ అనంతరం మైదుకూరు రోడ్డు మార్గంలో లోకేశ్ పాదయాత్ర సాగుతోన్న సమయంలో ఓ వ్యక్తి కోడిగుడ్డు విసరగా.. అది భద్రతా సిబ్బందిపై పడింది. కోడిగుడ్డు విసిరిన వ్యక్తిని తెదేపా కార్యకర్తలు పట్టుకొచ్చి దేహశుద్ధి చేసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
చంద్రునిపై ల్యాండర్, రోవర్ నుంచి అందని సంకేతాలు
-
పండగ సీజనులో కొనుగోళ్ల జోరు!
-
సంక్రాంతికి గ్రహాంతర విందు
-
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ చందాదారులా? అయితే, ఈ విషయం తెలుసా?
-
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌తో పాటు ఆ స్టార్ హీరోయిన్!
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?