CoronaVaccine: ఉబర్‌ డ్రైవర్లకు నగదు ప్రోత్సాహకాలు

తమ సంస్థలో పనిచేస్తున్న డ్రైవర్లు టీకా వేయించుకుంటే రూ.400 చొప్పున నగదు ప్రోత్సాహకాలను అందిస్తామని ఉబర్‌ సంస్థ ప్రకటించింది.

Published : 01 May 2021 01:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమ సంస్థలో పనిచేస్తున్న డ్రైవర్లు టీకా వేయించుకుంటే రూ.400 చొప్పున నగదు ప్రోత్సాహకాలను అందిస్తామని ఉబర్‌ సంస్థ ప్రకటించింది. రానున్న ఆరు నెలల్లో 1,50,000 మంది డ్రైవర్లకు 18.5 కోట్ల మేర నగదు ప్రోత్సాహకాలు ఇస్తామని వెల్లడించంది.  ‘‘భారత్‌లో కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సామూహిక టీకాలు వేయడం అవసరం. మా సంస్థలో పనిచేసే డ్రైవర్లకు టీకా వేయించుకునేందుకు అయ్యే ఖర్చులు మేమే భరిస్తాం. 1,50,000 మంది డ్రైవర్లకు రూ.18.5 కోట్ల నగదు ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నాం. టీకా తీసుకున్న డ్రైవర్లు చెల్లుబాటు అయ్యే టీకా ధ్రువీకరణ పత్రాను చూపిస్తే వాళ్లకు రూ.400 అందజేస్తాం. ఏప్రిల్‌ 30 లోపు టీకాలు వేయించుకున్న డ్రైవర్లు కూడా ఈ నగదు ప్రోత్సాహకాలను అందుకోవచ్చు’’ అని ఉబర్‌ తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని