కొవిడ్‌ మృతుల స్మృత్యర్థం ఉద్యానవనం! 

ఈ ఏడాది మార్చ్‌15 నుంచి జూన్‌ 15 వరకు, 90 రోజుల్లో చనిపోయిన దాదాపు ఆరువేల మంది కొవిడ్‌ రోగులకు భోపాల్‌లోని భాద్భద విశ్రామ్‌ ఘాట్‌లో దహన సంస్కారాలు నిర్వహించింది శ్మశానవాటిక సిబ్బంది. 

Published : 05 Jul 2021 23:40 IST

భోపాల్‌: కొవిడ్‌ సెకండ్‌వేవ్‌ ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది. ప్రధాన నగరాల్లో ఏ శశ్మానానికి వెళ్లినా కాలుతున్న శవాలే దర్శనమిచ్చేవి. అలా భోపాల్‌లోని భద్భదా విశ్రామ్‌ ఘాట్‌లో వందల సంఖ్యలో శవాలను దహన సంస్కారం చేశారు. కొంతమంది మృతుల బంధువులు వచ్చి అస్థికలు తీసుకెళ్లగా, కొవిడ్‌ ఆంక్షల వల్ల రాకపోకలు బంద్‌ అవడంతో తీసుకోకుండా మిగిలినపోయిన అస్థికలు 21 ట్రక్కుల చితాభస్మం అక్కడే మిగిలిపోయింది. దాన్ని ఏం చేయాలో అక్కడి సిబ్బందికితోచలేదు. సమీపంలోని నర్మద నదిలో పారబోయడం భావ్యం కాదని భావించి స్మృతి వనాన్ని నిర్మించాలనుకున్నారు. దీంతో శ్మశానవాటికలోనే 12వేల చదరపు అడుగులతో ఓ పార్కును ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అంత్యక్రియల నిర్వహణ కమిటీ సభ్యులు మమతేశ్‌ శర్మ చెప్పారు.  ఆ కమిటీ ప్రెసిడెంట్‌ అరుణ్‌ చౌదరి మాట్లాడుతూ, ‘‘శ్మశానవాటిక ఆవరణలోనే ఒక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మృతుల జ్ఞాపకాలను సజీవంగా ఉంచాలనుకున్నాం. మృతుల కుటుంబ సభ్యులను కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరాం’’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని