అనకాపల్లి వంతెన ఎందుకు కూలిందంటే?

విశాఖ జిల్లా అనకాపల్లి బైపాస్‌ వద్ద వంతెన కూలిన ఘటనపై జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారికంగా స్పందించింది. ఈనెల..

Published : 09 Jul 2021 01:20 IST

అనకాపల్లి: విశాఖ జిల్లా అనకాపల్లి బైపాస్‌ వద్ద వంతెన కూలిన ఘటనపై జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారికంగా స్పందించింది. ఈనెల 6వ తేదీ సాయంత్రం అనకాపల్లి సమీపంలో ఆనందపురం-పెందుర్తి-అనకాపల్లి జాతీయ రహదారిలో జరుగుతున్న ఆరు వరుసల బైపాస్‌ నిర్మాణంలో ఫ్లై ఓవర్‌ రెండుగడ్డర్లు పడిపోయాయని ఎన్‌హెచ్‌ ఏఐ జీఎం శివశంకర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని, ముగ్గురికి గాయాలయ్యాయని తెలిపారు.

‘‘ప్రమాద ఘటనను తీవ్రంగా పరిగణించాం. ఘటనకు సంబంధించి ముఖ్య వ్యక్తులను సస్పెండ్‌ చేశాం. ఇద్దరు ఆంధ్రా వర్సిటీ ప్రొఫెసర్లతో ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించాం. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. సరిపడా యాంకరేజ్‌ లేనందునే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధరణ. సరైన వుడెన్‌ సపోర్ట్‌ బేరింగ్‌ లేకపోవడం మరో కారణం’’ అని వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా నిబందనలు పాటించాలని ఆదేశించినట్టు చెప్పారు. ఎన్‌హెచ్‌ఏఐ జీఎం విడుదల చేసిన ప్రకటనలో బాధితులకు పరిహారం గానీ, క్షతగాత్రులకు వైద్య సహాయం అంశాలను ప్రస్తావించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని