vaccination for children: పిల్లలకు టీకా ఎప్పుడు..?

మూడోముప్పు ముంచుకొస్తోంది. ఈ ఏడాది చివరినాటికి మూడో వేవ్‌ అలజడి ప్రారంభమయ్యే అవకాశం ఉందని సర్వేలు హెచ్చరిస్తున్నాయి.

Published : 23 Sep 2021 01:46 IST

హైదరాబాద్‌ : మూడోముప్పు ముంచుకొస్తోంది. ఈ ఏడాది చివరినాటికి మూడో వేవ్‌ అలజడి ప్రారంభమయ్యే అవకాశం ఉందని సర్వేలు హెచ్చరిస్తున్నాయి.ఈ తరుణంలో అందరికీ ఒక్కడోసు టీకా అందించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వాలూ ఆ దిశగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే విద్యాసంస్థలు ప్రారంభం అయ్యాయి. పిల్లలందరూ చదువుల కోసం పాఠశాలల గడప తొక్కుతున్నారు.మరి వారి సంగతేమిటి??18 ఏళ్ల లోపు వారికి టీకాలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి. అక్టోబరులోనైనా వచ్చే అవకాశంఉందా...?? లేదా డిసెంబరు వరకూ ఆగాల్సిందేనా...??

థర్డ్‌ వేవ్‌ వస్తుందో...రాదో చెప్పలేం కానీ.. వస్తే మాత్రం పిల్లలపైనే అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని మెజారిటీ సర్వేలు అంచనా వేస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం ఆ సమయానికి వృద్ధులతో పాటు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కడోసు  టీకా తీసుకుంటారు.అసలు టీకా రక్షణ లభించనిది.. 18 ఏళ్లలోపు వారికే... ఫలితంగా థర్డ్‌వేవ్‌లో పిల్లలే ఎక్కువగా కరోనా బారినపడే అవకాశం ఉందని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో  వీలైనంత వేగంగా పిల్లల వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగానికి ఆమోదించాలని కేంద్రం భావిస్తోంది. మరిన్ని వివరాలు ఈ కింది వీడియోలో చూద్దాం... 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని