వాతావరణ మార్పులపై VIT-AP అంతర్జాతీయ సదస్సు

వీఐటీ -ఏపీ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్, వి.ఐ.టి.-ఏ.పి. విశ్వవిద్యాలయం, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ ఛేంజ్ (SICOM) మరియు  జియో క్లైమేట్ రిస్క్

Updated : 09 May 2022 18:42 IST

అమరావతి: వీఐటీ -ఏపీ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్, వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ ఛేంజ్ (SICOM), జియో క్లైమేట్ రిస్క్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (GCRS)ల విజ్ఞాన భాగస్వామ్యంతో ‘వాతావరణ సంక్షోభం, భవిష్యత్తు ప్రభావాలపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు’ జరిగింది. మే 8, 9వ తేదీల్లో వర్చువల్‌గా ఈ సదస్సును నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి సంజయ్ జల్లా (మిషన్ హెడ్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ ఛేంజ్‌ (SICOM) హాజరై మాట్లాడారు. వాతావరణ సంక్షోభం ఏర్పడకుండా బాధ్యతాయుతంగా వనరుల ఉత్పత్తి, వినియోగం ఉండాలని కోరారు. అంతర్జాతీయ, జాతీయ విద్యావేత్తలు, విధాన నిర్ణేతలు, నిపుణులు వాతావరణాన్ని కేంద్రంగా సమాజానికి అనుసరణ విధానాలు, ఆర్థిక, చట్టపరమైన వ్యూహాలు, మౌలిక సదుపాయాలపై సదస్సులో చర్చించారు.

అనంతరం వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్‌.ఎస్.వి.కోటారెడ్డి మాట్లాడారు. వాతావరణ మార్పులపై పరిశోధనా పత్రాలను సమర్పిస్తున్న వారికి స్వాగతం పలికి, అభినందనలు తెలిపారు. వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా చురుకైన చర్యలు తీసుకోవాల్సిన ప్రాముఖ్యతను తెలియజెప్పారు. క్యాంపస్‌లో సోలార్ పీవీ ప్యానెళ్లను అమర్చడం ద్వారా అంతర్గత ఇంధన వినియోగాన్ని తగ్గించడమే వీఐటీ-ఏపీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. యునైటెడ్ స్టేట్స్, మిడిల్ ఈస్ట్ నుంచి ఆహ్వానించిన అంతర్జాతీయ వక్తలు వాతావరణ మార్పు సమస్యలపై తమ దృక్పథాన్ని తెలియచేశారు.

టెక్సాస్ ఏ అండ్‌ ఎం యూనివర్శిటీకి చెందిన డా.దేబ్జానీ ఘటక్ ఉష్ణ తరంగాలు, భారతీయ పర్యావరణ సమస్యలపై తన పరిశోధనను పంచుకున్నారు. అబుదాబిలోని స్విస్ బిజినెస్ కౌన్సిల్ నుంచి పాల్గొన్న మాటియో బొఫ్పా విజయవంతమైన, స్థిరమైన వ్యాపారాన్ని నిర్వహించే ఆశాజనక అవకాశాలపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డా.రజనీష్ మిశ్రా, (డీన్, వీఐటీ-ఏపీ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అండ్‌ హ్యుమానిటీస్) డా.సుస్మిత శ్యాంసుందర్ (అసోసియేట్ డీన్, విష్) డా.తానియా చక్రవర్తి, డా.అరెకల కిచ్చు,  డా.ప్రియాంక ఘోష్, కనక హిమబిందు పొట్టుముత్తు, విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని