రాగల 24గంటల్లో మళ్లీ వర్షం

గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ మహానగరాన్ని

Published : 18 Oct 2020 15:14 IST

హైదరాబాద్‌: కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ మహానగరాన్ని వరుణుడు వణికిస్తున్నాడు. ఉదయమంతా ఎండ, పొడి వాతావరణం ఉన్నా, సాయంత్రమైతే చిరు జల్లులతో మొదలై కుంభవృష్టి కురుస్తోంది. రాబోయే రెండు మూడు రోజుల్లో అనేక చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణశాఖ వెల్లడించింది.

దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో 1.5కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. అదే విధంగా తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వివరించింది. అది మరింత బలపడి, అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని చోట్ల భారీ వర్షం పడుతుందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని