WhatsApp: వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు పునరుద్ధరణ

 ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు పునరుద్ధరణ అయ్యాయి.

Updated : 05 Oct 2021 09:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన వాట్సప్‌ సేవలు పునరుద్ధరణ అయ్యాయి. సోమవారం రాత్రి 9 గంటల నుంచి సామాజిక మాధ్యమాలు అయిన వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం సేవలు ప్రపంచ వ్యాప్తంగా స్తంభించిపోయాయి. దీంతో వినియోగదారులు కొన్ని గంటల పాటు ఇబ్బంది పడ్డారు. దాదాపు 7 గంటల తర్వాత మంగళవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి వాట్సప్‌ సేవలను పునరుద్ధరించారు. ఈ సందర్భంగా సేవల అంతరాయంపై ఫేస్‌బుక్‌ క్షమాపణలు చెప్పింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా మాపై ఆధారపడిన కోట్ల మంది ప్రజలకు, వ్యాపార కార్యకలాపాలు నడుపుతున్న వారికి క్షమాపణలు. నిలిచిపోయిన మా సేవలను పునరుద్ధరించడంతో తిరిగి ఆన్‌లైన్‌కు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. మాతో సహకరించినందుకు ధన్యవాదాలు’’ అని ఫేస్‌బుక్‌ ట్విటర్‌లో పోస్టు చేసింది.  

ప్రపంచవ్యాప్తంగా వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం సేవలు నిలిచిపోవడంతో ఈ వార్త ఒక్కసారిగా సంచలనమైంది. వీటిపై ఆధారపడ్డ కోట్ల మంది ఎందుకిలా జరిగిందో అర్థంకాక హైరానా పడ్డారు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి ట్విటర్‌లో పోస్టులు పెట్టారు. పలువురు ప్రత్యామ్నాయ సామాజిక మాధ్యమాలవైపు దృష్టి సారించారు. భారత్‌లో దాదాపు 41 కోట్ల మంది ఫేస్‌బుక్‌ వినియోగదారులున్నారు. వాట్సప్‌ను సుమారు 53 కోట్ల మంది వాడుతున్నారు. ఇన్‌స్టాగ్రాం ఖాతాదారులు 21 కోట్ల పైనే ఉన్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని