sabja seeds: వేసవి తాపానికి చెక్‌... సబ్జా గింజలు చేసే మేలేంటో తెలుసా?

రోజురోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో శరీరానికి ఆరారా చల్లని ద్రవాలన్ని, పదార్థాలని అందించడం చాలా అవసరం. లేదంటే శరీరం డీహైడ్రేట్‌ అయి వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఎక్కువ.

Published : 30 Apr 2022 12:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రోజురోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో శరీరానికి చల్లని ద్రవ పదార్థాలను అందించడం చాలా అవసరం. లేదంటే డీహైడ్రేట్‌ అయి వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే నానుడి సబ్జా గింజల(sabja seeds)కు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే సబ్జాల్లో ఉండే ఔషధగుణాలు అలాంటివి.

* ఎండ దెబ్బ నుంచి తక్షణమే ఉపశమనం కలిగించి శరీరంలో జీవ క్రియలు సక్రమంగా జరిగేందుకు ఇవి చాలా ఉపయోగపడతాయి.

* వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాదు, సౌందర్య సంరక్షణకు ఉపయోగకరం.

* శరీరాన్ని వేసవి తాపానికి గురికాకుండా కాపాడేందుకు పండ్లు, మజ్జిగ, లస్సీ వంటి పదార్థలతో పాటు కొన్ని గింజలను కూడా భాగం చేసుకోవాలి.

* పండ్ల రసాలు తాగేటప్పుడు వాటిలో నానబెట్టిన సబ్జాలను కలుపుకుని తాగితే ఆరోగ్యంతో పాటు వేసవి తాపానికి చెక్‌ పడుతుంది.

* ఈ గింజల్లో ఉండే ఔషధగుణాలు డీటాక్సిఫికేషన్‌ నుంచి కాపాడుతాయి. వాహనాలు, గాలి, నీటి కాలుష్యం వల్ల చర్మం నల్లగా మారిపోతుంది. సబ్జా తీసుకోవడం వల్లన ఈ సమస్యను అధిగమించవచ్చు.

* శరీరంలో ఉండే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్స్‌, కొవ్వు పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి.

* మలబద్ధకాన్ని తగ్గించడంలో, పేగుల కదలికను ప్రోత్సాహించడంలో, మూత్రపిండాల పనితీరు పెంచడంలో, రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గించడం, నెమ్మదిగా బరువు తగ్గడానికి సహాయ పడుతుంది.

* జుట్టు ఊడిపోకుండా ఒత్తుగా పెరగడానికి కూడా ఇది సహాయ పడుతుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని