Afghanistan crisis: నన్ను తాలిబన్లు కొట్టారు..

తాలిబన్లు హస్తగతం చేసుకున్న అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి

Updated : 29 Feb 2024 15:54 IST

కాబుల్‌: తాలిబన్లు హస్తగతం చేసుకున్న అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి. అమాయకపు ప్రజలపై తాలిబన్లు పాల్పడుతున్న దారుణాలు రోజురోజుకీ పెచ్చరిల్లుతున్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని వారంతా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆ దేశాన్ని విడిచి వెళ్లాలని చాలా మంది కాబుల్‌ విమానాశ్రయానికి తరలివెళ్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి విమానాశ్రయానికి వెళ్తున్న సమయంలో తాలిబన్లు అతడిపై దాడి చేశారు. ఈ విషయాన్ని స్వయంగా అతడే వీడియోలో చెప్పుకొచ్చాడు.

‘నా కుటంబంతో కలిసి కాబుల్‌ విమానాశ్రయానికి వెళ్తున్నా. ఈ క్రమంలో తాలిబన్లు మాపై దాడికి పాల్పడ్డారు. వారు నన్ను కొట్టారు. నేను ఆస్ట్రేలియా పౌరుడిని’ అని తెలిపారు. ‘నేను ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాలనుకుంటే.. చూడండి వారేం చేశారో..’ అంటూ తన ఆవేదనను ఈ వీడియో ద్వారా వెల్లబుచ్చుకున్నారు. ఇందులో అతడి తల నుంచి రక్తం  కారుతున్నట్లుగా కనిపిస్తోంది. అతడు ఏం జరిగిందో వివరించడానికి చాలా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. అతడి దగ్గర నుంచి ఎవరో ఫోన్‌ లాక్కోవడంతో ఆ వీడియో మధ్యలోనే ఆగిపోయింది. తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి దారుణమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని