
Drone: జమ్ము సరిహద్దుల్లో డ్రోన్
జమ్ము: జమ్ముకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల సంచారం కలకలం సృష్టించింది. శుక్రవారం అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఓ పాకిస్థాన్ డ్రోను మన దేశ భూభాగంలోకి ప్రవేశించేందుకు యత్నించింది. అయితే సరిహద్దు భద్రతా సిబ్బంది అప్రమత్తమై కాల్పులు జరపడంతో ఆ డ్రోన్ వెనుదిరిగినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ తెల్లవారుజామున 4.25 గంటల ప్రాంతంలో జమ్ము శివారులోని అర్నియా సెక్టార్‌లో ఓ చిన్న క్వాడ్‌కాప్టర్ అంతర్జాతీయ సరిహద్దును దాటేందుకు ప్రయత్నించింది. ఈ డ్రోన్‌ను గుర్తించిన బీఎస్‌ఎఫ్ సిబ్బంది వెంటనే ఆరుసార్లు కాల్పులు జరిపారు. దీంతో ఆ డ్రోన్ పాకిస్థాన్ వైపు వెళ్లిపోయిందని బీఎస్‌ఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ప్రాంతంలో నిఘా కోసం డ్రోన్ పంపి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. జమ్ములో అనుమానిత డ్రోన్లు సంచరించడం ఈ వారంలో ఇది నాలుగోసారి కావడం గమనార్హం.
గత ఆదివారం తెల్లవారుజామున జమ్ము వైమానిక స్థావరంపై డ్రోన్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లోకి ప్రవేశించిన రెండు డ్రోన్లు బాంబులు జారవిడిచాయి. ఈ ఘటనలో భవనం పైకప్పు ధ్వంసమైంది. ఆ తర్వాత మరుసటి రోజే జమ్ములోని మరో సైనిక స్థావరంపై డ్రోన్ దాడిని సైన్యం భగ్నం చేసింది. రెండు రోజుల తర్వాత కాలూచక్, రత్నచక్ ప్రాంతంలో మరోసారి డ్రోన్లు కన్పించాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Zimbabwe: త్వరలో బంగారు నాణేలు ముద్రించనున్న జింబాబ్వే..!
-
Politics News
Konda Vishweshwar Reddy: నెలకు ఒక్క లీడర్‌నైనా భాజపాలోకి తీసుకొస్తా: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
-
World News
Boris Johnson: మరింత సంక్షోభంలో బోరిస్ సర్కారు.. మరో ఇద్దరు మంత్రుల రాజీనామా
-
Politics News
Yanamala: దోచుకున్న ప్రతి రూపాయీ ప్రజలు కక్కిస్తారు: యనమల
-
Business News
Paid trip to employees: ఉద్యోగులందరికీ 2 వారాల ట్రిప్.. ఖర్చులన్నీ కంపెనీవే!
-
India News
LPG price: వంటగ్యాస్ మంట.. ఏడాదిలో రూ.244 పెంపు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra News: మేకప్ వేసి.. మోసం చేసి.. ముగ్గురిని వివాహమాడి..
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
- Gas Cylinder: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- ప్రముఖ వాస్తు నిపుణుడి దారుణ హత్య.. శరీరంపై 39 కత్తిపోట్లు
- Health : పొంచి ఉన్న ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు!
- Online Food delivery: ఆన్లైన్ Vs ఆఫ్‌లైన్: ఫుడ్ డెలివరీ దోపిడీని బయటపెట్టిన యూజర్.. పోస్ట్ వైరల్!
- Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య