Rakesh Tikait: వాయు కాలుష్యానికి రైతుల్ని నిందించొద్దు: రాకేశ్‌ టికాయత్‌

దిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్‌)లో వాయు కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. అయితే, రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్లనే వాయుకాలుష్యం పెరుగుతోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీన్ని భారతీయ కిసాన్‌ యూనియన్‌ ప్రతినిధి రాకేశ్‌ టికాయత్‌

Published : 16 Nov 2021 23:04 IST

ఘజియాబాద్‌: దిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్‌)లో వాయు కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. అయితే, రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్లనే వాయుకాలుష్యం పెరుగుతోందని కొందరు ప్రకటిస్తున్నారు. దీన్ని భారతీయ కిసాన్‌ యూనియన్‌ ప్రతినిధి రాకేశ్‌ టికాయత్‌ ఖండించారు. వాయు కాలుష్యానికి రైతుల్ని నిందించొద్దని అన్నారు. 

‘‘పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల కేవలం 10శాతం మాత్రమే కాలుష్యం జరుగుతోందని, దీని బట్టి మొత్తం వాయు కాలుష్యానికి రైతుల్ని నిందించడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాబట్టి రైతుల వల్లే గాలి కాలుష్యం పెరుగుతోందని వాదించే వారంతా రైతులకు క్షమాపణ చెప్పాలి ’’అని రాకేశ్‌ టికాయత్‌ డిమాండ్‌ చేశారు. దిల్లీ.. పరిసర ప్రాంతాల్లో శీతాకాలంలో వాయు కాలుష్యం తీవ్రస్థాయిలో ఉంటుంది. దీనికి పంట వ్యర్థాలను తగలబెట్టడంతోపాటు, పరిశ్రమలు.. వాహనాల నుంచి వచ్చే ఉద్గారాలు, బాణసంచా కాల్చడం ముఖ్య కారణాలని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. నూతన సాగు చట్టాలని నవంబర్‌ 26లోపు రద్దు చేయాలని, లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని రాకేశ్‌ టికాయత్‌ గతంలోనే హెచ్చరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని