17వేల అడుగుల ఎత్తులో మువ్వన్నెల రెపరెపలు

దేశవ్యాప్తంగా 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జమ్మూకశ్మీర్‌లో ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ దళ(ఐటీబీపీఎఫ్‌) సైనికులు 17,000వేల అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఎగురవేశారు.........

Published : 26 Jan 2020 12:49 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జమ్మూకశ్మీర్‌లో ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌(ఐటీబీపీ) దళం 17 వేల అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఎగురవేసింది. హిమపాతాల మధ్య సైనికులు తెల్లటి యూనిఫాంలో భరత మాతకు జేజేలు పలికారు. గడ్డకట్టిన మంచుపై కవాతు చేస్తూ గణతంత్ర వేడుకల విశిష్టతను చాటారు. ఈసారి రిపబ్లిక్‌ డే వేడుకల సందర్భంగా 15 మంది ఐటీబీపీ జవాన్లకు రాష్ట్రపతి పతకాలు లభించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని