నిర్భయ దోషుల ఇంటర్వ్యూ కోసం ప్రయత్నాలు

సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో త్వరలో ఉరికంభం ఎక్కబోతున్న నలుగురు దోషులను ఇంటర్వ్యూ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కేసులో దోషులైన ముకేశ్‌ కుమార్‌ సింగ్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ, అక్షయ్‌

Published : 11 Mar 2020 14:33 IST

దిల్లీ: సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో త్వరలో ఉరికంభం ఎక్కబోతున్న నలుగురు దోషులను ఇంటర్వ్యూ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కేసులో దోషులైన ముకేశ్‌ కుమార్‌ సింగ్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ, అక్షయ్‌ కుమార్‌లను ఇంటర్వ్యూ చేసేందుకు అనుమతి కల్పించాలంటూ ఓ మీడియా సంస్థ దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.  దీనిపై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం.. మీడియా సంస్థ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని తిహాడ్‌ జైలు అధికారులను అడిగింది. దీనిపై రేపటి(గురువారం)లోగా తమ నిర్ణయం తెలపాలని కోర్టు స్పష్టం చేసింది. 

పలు వాయిదాల అనంతరం నిర్భయ దోషులను ఈ నెల 20 ఉదయం 5.30 గంటలకు ఉరితీయాలంటూ దిల్లీ పటియాలా హౌస్‌ కోర్టు ఇటీవల కొత్త డెత్‌ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. నిజానికి జనవరి 22నే వీరిని ఉరితీయాల్సి ఉండగా.. న్యాయపరమైన అవకాశాల పేరుతో చివరి నిమిషంలో దోషులు కొత్త పిటిషన్లు, క్షమాభిక్షకు దరఖాస్తులు పెట్టుకోవడంతో ఇప్పటికే మూడు సార్లు ఉరితీత వాయిదా పడింది. అయితే ప్రస్తుతం దోషులకున్న అన్ని దారులు మూసుకుపోయాయి. దీంతో మార్చి 20న వీరిని ఉరితీయడం దాదాపు ఖాయంగానే కన్పిస్తోంది. 

అయినప్పటికీ ఉరి అమలు వాయిదా కోసం దోషులు ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.  తన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలంటూ దోషుల్లో ఒకడైన వినయ్‌శర్మ ఇటీవల దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు దరఖాస్తు పెట్టుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని