కరోనా కేసుల్లో ఐదో స్థానానికి భారత్‌!

దేశవ్యాప్తంగా కొవిడ్‌ తీవ్రత కలవరానికి గురిచేస్తోంది. వివిధ రాష్ట్రాలు వెల్లడించిన వివరాల ప్రకారం శనివారం సాయంత్రానికి కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,46,585కు చేరాయి. మొత్తం 6,895 మంది ప్రాణాలు కోల్పోగా........

Published : 07 Jun 2020 08:26 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా కొవిడ్‌ తీవ్రత కలవరానికి గురిచేస్తోంది. వివిధ రాష్ట్రాలు వెల్లడించిన వివరాల ప్రకారం శనివారం సాయంత్రానికి కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,46,585కు చేరాయి. మొత్తం 6,895 మంది ప్రాణాలు కోల్పోగా.. 1,18,918 మంది కోలుకున్నారు. కరోనా కేసుల సంఖ్యలో శనివారం ఉదయానికి ఇటలీని వెనక్కి నెట్టిన భారత్‌.. తాజాగా స్పెయిన్‌ను కూడా దాటి ప్రపంచంలోనే అత్యధికంగా కేసులున్న దేశంగా నిలిచిందని జాన్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయం తెలిపింది. దేశంలోనే మొత్తం బాధితుల్లో సగం మంది నాలుగు మెట్రోనగరాలు దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోనే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని