ఎన్నికల ప్రక్రియలో మహిళలు మరింతగా పాల్గొనాలి: రాష్ట్రపతి

ఎన్నికల ప్రక్రియలో మరింత మంది మహిళలు పాల్గొనాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. బుధవారం ఆమె 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు.

Published : 26 Jan 2023 05:40 IST

దిల్లీ: ఎన్నికల ప్రక్రియలో మరింత మంది మహిళలు పాల్గొనాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. బుధవారం ఆమె 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. 2019 ఎన్నికల్లో పురుషులు కంటే ఎక్కువ మంది మహిళలు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారని చెప్పారు. పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం పెరగడంపైనా ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఉభయసభల్లో మహిళా ఎంపీల సంఖ్య 115కు చేరుకుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజూ, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు