మిఠాయిలు ఇచ్చిపుచ్చుకున్న భారత్‌, పాక్‌ సైనికులు

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న వివిధ అవుట్‌పోస్టులలో సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌), పాకిస్థాన్‌ రేంజర్స్‌ సిబ్బంది గురువారం మిఠాయిలు, శుభాకాంక్షలు ఇచ్చి పుచ్చుకున్నారు.

Published : 27 Jan 2023 05:04 IST

జమ్మూ: భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న వివిధ అవుట్‌పోస్టులలో సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌), పాకిస్థాన్‌ రేంజర్స్‌ సిబ్బంది గురువారం మిఠాయిలు, శుభాకాంక్షలు ఇచ్చి పుచ్చుకున్నారు. నియంత్రణ రేఖ వద్ద రాజౌరీ, పూంఛ్‌లలో ఉన్న ఫార్వర్డ్‌ పోస్టులలో భారత, పాక్‌ సైనికులు స్వీట్లు, శుభాకాంక్షలను పంచుకున్నారు. అంతర్జాతీయ సరిహద్దు హెడ్‌క్వార్టర్స్‌ వద్ద బీఎస్‌ఎఫ్‌ ఐజీ డీకే బూరా జాతీయ జెండాను ఎగరవేసి సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని