అయోధ్యకు రానున్న ఆరు కోట్ల సంవత్సరాల నాటి శిలలు

రామజన్మభూమి గర్భాలయంలో కొలువు దీరే శ్రీరాముడి విగ్రహాన్ని రూపొందించడానికి.. ఎంపిక చేసిన రెండు అరుదైన శిలలు గురువారం అయోధ్యకు చేరుకుంటాయని ఆలయ ట్రస్టు అధికారి శనివారం తెలిపారు.

Updated : 29 Jan 2023 06:08 IST

వాటితో రాముని విగ్రహం తయారీ

అయోధ్య: రామజన్మభూమి గర్భాలయంలో కొలువు దీరే శ్రీరాముడి విగ్రహాన్ని రూపొందించడానికి.. ఎంపిక చేసిన రెండు అరుదైన శిలలు గురువారం అయోధ్యకు చేరుకుంటాయని ఆలయ ట్రస్టు అధికారి శనివారం తెలిపారు. ‘ఆరు కోట్ల సంవత్సరాల వయసు కలిగిన ఈ సాలగ్రామ శిలలు నేపాల్‌లోని గండకీ నదీ తీరంలో లభించాయి. ఈ అరుదైన శిలతో బాల రాముడి విగ్రహాన్ని రూపొందించి గర్భాలయంలో ప్రతిష్ఠిస్తాం.’ అని ట్రస్టు అధికారి వెల్లడించారు. 26, 14 టన్నులున్న ఈ శిలలు మూడు రోజుల క్రితమే నేపాల్‌ నుంచి రెండు ట్రక్కులపై బయలుదేరాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని