కాలం చెల్లిన మందులకు నిప్పు.. పొగతో 11మంది విద్యార్థులకు అస్వస్థత

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకీలో కాలం చెల్లిన మందులతో పాటు ఉన్న చెత్తకు నిప్పు పెట్టడంతో.. ఆ పొగ పీల్చి 11మంది పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

Updated : 02 Feb 2023 06:04 IST

బారాబంకీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకీలో కాలం చెల్లిన మందులతో పాటు ఉన్న చెత్తకు నిప్పు పెట్టడంతో.. ఆ పొగ పీల్చి 11మంది పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ‘‘కమ్హరియా ప్రాంతంలోని ప్రైవేటు పాఠశాలలో చెత్తకు నిప్పుపెట్టారు. అందులో కాలం చెల్లిన మందులు ఉన్నాయి. అది రసాయనాలు విడుదల చేయడంతో  నలుగురు విద్యార్థినులతో పాటు 7మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించాం. నిప్పు పెట్టిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాం’’ అని సర్కిల్‌ ఆఫీసర్‌ నవీన్‌ కుమార్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు