రూ.300 లంచం తీసుకున్న వ్యక్తికి 20ఏళ్ల తర్వాత విముక్తి

మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి 300 లంచం తీసుకున్న కేసులో ఆసుపత్రి క్లీనర్‌కు 20ఏళ్ల తర్వాత విముక్తి లభించింది. ఈ మేరకు ట్రయల్‌ కోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు పక్కనబెట్టింది.

Published : 24 Mar 2023 04:25 IST

దిల్లీ: మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి 300 లంచం తీసుకున్న కేసులో ఆసుపత్రి క్లీనర్‌కు 20ఏళ్ల తర్వాత విముక్తి లభించింది. ఈ మేరకు ట్రయల్‌ కోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు పక్కనబెట్టింది. 2003లో మరణ ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు పంజాబ్‌లోని ఆసుపత్రిలో జగ్తార్‌ సింగ్‌ రూ.300 లంచం తీసుకున్నారని అవినీతి నిరోధకశాఖ అరెస్టు చేసింది. ఆయనపై కేసు నమోదు చేయగా ట్రయల్‌ కోర్టు విచారణ జరిపి 2005లో ఏడాదిపాటు జైలు శిక్ష విధించింది. 2010లో పంజాబ్‌, హరియాణా హైకోర్టు ఆ తీర్పును సమర్థించింది. దీనిని సవాలు చేస్తూ అప్పట్లోనే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈలోగా 2016లో ఆయన పదవీ విరమణ చేశారు. 38 రోజులపాటు జైల్లో గడిపారు. ఈ కేసు 13 ఏళ్లుగా అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉంది. తాజాగా జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓక్‌, రాజేశ్‌ బిందాల్‌ ఈ కేసును విచారించారు. ప్రాసంగిక సాక్ష్యాల ఆధారంగా నిందితుడిని దోషిగా తేల్చలేమని వారు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని