Sabarimala: శబరిమల కొండలలో అక్రమ పూజలు

కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని పొన్నాంబళమేడు పర్వత శిఖరం మీద అక్రమంగా పూజలు చేసిన వ్యక్తి ఉదంతం కేరళలో సంచలనం రేపుతోంది.

Updated : 17 May 2023 07:30 IST

కేసు నమోదు చేసిన కేరళ అటవీశాఖ

పథనంథిట్ట: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని పొన్నాంబళమేడు పర్వత శిఖరం మీద అక్రమంగా పూజలు చేసిన వ్యక్తి ఉదంతం కేరళలో సంచలనం రేపుతోంది. ఆ పూజల వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. తమిళనాడుకు చెందిన నారాయణ స్వామి, మరో నలుగురితో కలసి ఈ పూజలు చేసినట్లు వీడియోలో గుర్తించారు. పొన్నాంబళమేడు పైనే మకరజ్యోతిని వెలిగిస్తారు. ఈ నేపథ్యంలో అయ్యప్ప భక్తులకు ఈ పర్వతం పరమ పవిత్రమైనది. దట్టమైన కారడవిలో ఉన్న ఈ పర్వతం అటవీ శాఖ పరిరక్షణలో ఉంటుంది. అలాంటి చోటుకు నిందితులు ఎలా ప్రవేశించగలిగారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై పోలీసులకు, వన్యమృగ శరణాలయ అధిపతికీ ఫిర్యాదు చేస్తామని తిరువాన్కూరు దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కె.అనంత గోపన్‌ తెలిపారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని రాష్ట్ర అటవీ శాఖ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని