విద్యార్థుల కళ్లెదుటే.. మహిళా టీచర్ల సిగపట్లు

బిహార్‌ విద్యావ్యవస్థలో లోపాలు తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి. తాజాగా ఓ పాఠశాలలో మహిళా టీచర్లు తన్నుకున్నారు.

Updated : 27 May 2023 06:23 IST

బిహార్‌ విద్యావ్యవస్థలో లోపాలు తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి. తాజాగా ఓ పాఠశాలలో మహిళా టీచర్లు తన్నుకున్నారు. జుట్లు పట్టుకొని చెప్పులతో కొట్టుకున్నారు. పట్నాలోని కొరియా పంచాయత్‌ విద్యాలయ్‌ స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. తరగతి గదిలోకి వచ్చిన ప్రధానోపాధ్యాయురాలు కాంతికుమారి కిటికీ తలుపులు మూయాలని అనితాకుమారి అనే టీచరుకు చెప్పారు. ఇందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత కాంతికుమారి గది నుంచి బయటకు వస్తుండగా.. అనిత ఆమె వెనుకే వచ్చి చెప్పుతో దాడి చేశారు. అనితకు మద్దతుగా మరో టీచరు కూడా కాంతికుమారిపై దాడికి దిగారు. బడి పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లి ఈ ముగ్గురూ కొట్టుకున్నారు. ఇదంతా విద్యార్థుల కళ్ల ముందే జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని