హనుమంతుడు గిరిజనుడే..
హనుమంతుడు గిరిజనుడేనని మధ్యప్రదేశ్‌కు చెందిన మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ధార్ జిల్లాలోని గంధ్వాని నియోజకవర్గ ఎమ్మెల్యే ఉమంగ్ సింఘర్ శుక్రవారం ఓ బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్య
భోపాల్: హనుమంతుడు గిరిజనుడేనని మధ్యప్రదేశ్‌కు చెందిన మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ధార్ జిల్లాలోని గంధ్వాని నియోజకవర్గ ఎమ్మెల్యే ఉమంగ్ సింఘర్ శుక్రవారం ఓ బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘శ్రీరాముడిని లంకకు తీసుకెళ్లింది గిరిజనులే. కొంతమంది రచయితలు వానరసేన తీసుకెళ్లిందని రాసినప్పటికీ అది వాస్తవం కాదు. అప్పటికి అడవిలో ఉన్నదంతా గిరిజనులు మాత్రమే. అందులో హనుమంతుడు ఒకరు. మనమంతా ఆయన వారసులమైనందుకు గర్వపడదాం’’ అని పేర్కొన్నారు. ఈ నెల మొదట్లో ఇదే జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే అర్జున్ సింగ్ కకోడియా కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘‘గిరిజనుడైన పరమశివుడు విషం తాగి ఈ లోకాన్ని కాపాడారు. మన గిరిజన సమాజం ఎంతో ఉన్నతమైంది. ప్రపంచంలోని మనుషులందరూ ఇందులో నుంచి వచ్చిన వారే. అలాగే ఆంజనేయుడూ అడవి నివాసే. ఆయనే శ్రీరాముడికి సాయం చేశారు తప్ప క్షత్రియ, బ్రాహ్మణ సేనలు కాదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో బ్రేక్ దర్శనం, గదుల బుకింగ్‌కు ‘పే లింక్’ సందేశాలతో నగదు చెల్లింపు!
-
విశాఖలో పిడుగు పాటు.. వీడియో వైరల్
-
ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఎంబీఏ విద్యార్థిని బలవన్మరణం
-
రావణుడి అత్తవారింట రామాలయం.. 35 ఏళ్లుగా తిరిగిచూడని భక్తులు
-
Bandaru Satyanarayana: మాజీ మంత్రి బండారు నివాసం వద్ద అర్ధరాత్రి భారీగా పోలీసుల మోహరింపు
-
సముద్రంలో 36 గంటలు.. గణపతి విగ్రహ చెక్కబల్లే ఆధారంగా..