రూ.60కే ఇంటి భోజనం

మొబైల్‌లో ఆర్డర్‌ చేస్తే చాలు.. తక్కువ ధరకు ఇంటికే లంచ్‌ బాక్స్‌ వస్తుంది. ఇది కేరళలో ఆదరణ పొందుతున్న డ్వాక్రా మహిళలు ప్రారంభించిన ‘కుటుంబశ్రీ లంచ్‌ బెల్‌ ప్రాజెక్టు’.

Published : 27 Mar 2024 04:25 IST

కేరళలో ఆదరణ పొందుతున్న డ్వాక్రా మహిళల ప్రాజెక్టు

ఈటీవీ భారత్‌: మొబైల్‌లో ఆర్డర్‌ చేస్తే చాలు.. తక్కువ ధరకు ఇంటికే లంచ్‌ బాక్స్‌ వస్తుంది. ఇది కేరళలో ఆదరణ పొందుతున్న డ్వాక్రా మహిళలు ప్రారంభించిన ‘కుటుంబశ్రీ లంచ్‌ బెల్‌ ప్రాజెక్టు’. ఈ నెల 5న కేరళ రాజధాని తిరువనంతపురంలో రాష్ట్ర మంత్రి ఎంబీ రాజేశ్‌ ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. మార్చి 6న సేవలు మొదలయ్యాయి. ఆర్డర్ల కోసం ‘పాకెట్‌ మార్ట్‌ మొబైల్‌’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. శాకాహార భోజనానికి రూ.60, మంసాహారానికి రూ.90 వసూలు చేస్తున్నారు. యాప్‌ ద్వారా ఉదయం 6 గంటల నుంచి లంచ్‌ బాక్స్‌ ఆర్డర్‌ చేయవచ్చు. సాయంత్రం 6 గంటల తర్వాత మరుసటి రోజు కోసం ఆర్డర్‌ చేసుకునే సదుపాయం కూడా ఉంది. ఉదయం 11 గంటల నుంచే లంచ్‌ బాక్స్‌లను డెలివరీ చేస్తుంటారు. మళ్లీ మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి ఖాళీ బాక్స్‌ను తీసుకుంటారు. వీరికి కేవలం 16 రోజుల్లో 2000కుపైగా ఆర్డర్లు రావడం విశేషం. ఈ ప్రాజెక్టు కింద భోజనాన్ని తయారు చేసేందుకు 11 మంది, ఆహారం డెలివరీ కోసం 8 మంది ఉద్యోగులు ఉన్నారు. ఆదివారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో శాఖాహార, మాంసాహార ఆహారం అందుబాటులో ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని