సీఏ పరీక్షల వాయిదాకు ‘పిల్‌’

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. మే నెలలో జరగాల్సిన చార్టర్డ్‌ ఎకౌంటెన్సీకి సంబంధించిన కొన్ని పరీక్షలను వాయిదా వేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యా (పిల్‌)న్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

Published : 30 Apr 2024 04:39 IST

తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. మే నెలలో జరగాల్సిన చార్టర్డ్‌ ఎకౌంటెన్సీకి సంబంధించిన కొన్ని పరీక్షలను వాయిదా వేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యా (పిల్‌)న్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పోలింగ్‌ రోజున ఏ పరీక్షనూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ ఎకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) నిర్వహించడం లేదని పేర్కొంది. తేదీలను మార్చడం వల్ల పరీక్ష నిర్వహణకు ఇప్పటికే చేసిన ఏర్పాట్లకు విఘాతం కలుగుతుందని, ఎంతోమంది విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అభిప్రాయపడింది. పరీక్షల షెడ్యూల్‌ అనేది ‘విధానపరమైన నిర్ణయాల’కు సంబంధించిన అంశమని పేర్కొంది. సీఏ పరీక్షలు మే 2 నుంచి మే 17వరకు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 591 కేంద్రాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. 4లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షల కోసం నమోదు చేసుకున్నారు. మే 7, 13న పలు రాష్ట్రాల్లో పోలింగ్‌ జరగనున్నందున మే 8, 14న జరగనున్న పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ పిల్‌ దాఖలైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని