Jharkhand crisis: సంక్షోభం దిశగా ఝార్ఖండ్‌ ప్రభుత్వం.. నేడు సోరెన్‌ రాజీనామా?

ఝార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. ముఖ్యంత్రి హేమంత్‌ సోరెన్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవచ్చనే ప్రచారం జోరందుకొంది. రాజీనామా

Published : 01 Sep 2022 15:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఝార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవచ్చనే ప్రచారం జోరందుకొంది. రాజీనామా అనంతరం గవర్నర్‌తో భేటీ అయి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వమని ఆయన కోరవచ్చు. ఈ విషయమై నేడు సాయంత్రం సంకీర్ణ ప్రభుత్వ నేతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం వీరు గవర్నర్‌ను కలిసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

 జేఎంఎం, కాంగ్రెస్‌, ఆర్జేడీ సంకీర్ణంలోని 34 మంది ఎమ్మెల్యేలను మంగళవారం ఛత్తీస్‌గడ్‌కు తరలించారు. భాజపా నేతలు తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తారని భావించిన సోరన్‌ వారిని మరో రాష్ట్రం దాటించారు. గురువారం సాయంత్రం 4 గంటలకు హేమంత్‌ సోరెన్‌ తన మంత్రి వర్గ భేటీని ఏర్పాటు చేశారు. దీంతో ఛత్తీస్‌గడ్‌ నుంచి ఎమ్మెల్యేలు తిరిగి రాంచీ చేరుకొన్నారు. 

‘ఆఫీస్‌ ఆఫ్‌ ఫ్రాఫిట్‌’ కేసులో హేమంత్‌ సోరెన్‌పై అనర్హత వేటువేయాలని భాజపా నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ నిర్వహించిన ఈసీ తన నిర్ణయాన్ని గవర్నర్‌ రమేష్‌ బాయిస్‌కు పంపింది. దానిలో ఈసీ ఏమి చర్యలను సూచించిందనే విషయం ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదు. మొత్తం 81 మంది సభ్యులు కలిగిన ఝార్ఖండ్‌ అసెంబ్లీలో అధికార యూపీఏకి 49 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. 30 మంది ఎమ్మెల్యేలతో ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా అతిపెద్ద పార్టీగా ఉండగా.. కాంగ్రెస్‌కు 18 మంది, ఆర్జేడీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. భాజపాకు 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని