Delhi: నేను దొంగనే... కేజ్రీవాల్‌ మరి మీరేంటి?: సుకేశ్‌ చంద్రశేఖర్‌

జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమ్‌ ఆద్మీపార్టీ నేత సత్యేందర్ జైన్ బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని రూ.200 కోట్ల మోసం కేసులో అరెస్టయిన ఆర్థిక మోసగాడు సుకేశ్‌ చంద్రశేఖర్‌ ఆరోపించాడు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ రాశాడు.

Published : 05 Nov 2022 21:28 IST

దిల్లీ: జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమ్‌ ఆద్మీపార్టీ నేత సత్యేందర్ జైన్ బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని రూ.200 కోట్ల మోసం కేసులో అరెస్టయిన  సుకేశ్‌ చంద్రశేఖర్‌ ఆరోపించాడు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ రాశాడు. ఆప్‌ పార్టీకి కోట్ల రూపాయల విరాళాలిచ్చినట్లు పునరుద్ఘాటించాడు. ఆమ్‌ఆద్మీపార్టీ పన్నిన కల్పిత వ్యూహంలో భాజపా, దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పావులుగా మారారని విమర్శించాడు.ఈ లేఖపై  కేజ్రీవాల్‌ స్పందించారు. మరికొన్ని రోజుల్లో సుకేశ్‌ భాజపాలో చేరుతారన్న సమాచారం తనకుందన్నారు. 

మరోవైపు చంద్రశేఖర్‌ తాజా లేఖలతో ఆప్‌ నిజస్వరూపం బయటపడుతోందని భాజపా వ్యాఖ్యానించింది. ‘2015 నుంచి నాకు సత్యేంద్ర జైన్‌ తెలుసు. ఆప్‌ పార్టీకి రూ.50 కోట్లు విరాళంగా ఇచ్చాను. దీనికి బదులుగా రాజ్యసభ సీటు కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారు.’  అని చంద్రశేఖర్‌ తన లేఖలో పేర్కొన్నాడు. కేజ్రీవాల్‌ అంటున్నట్లుగా నేను దొంగనే కావొచ్చు. మరి నాదగ్గర నుంచి డబ్బు గుంజుకున్న ఆయన్ని ఏమనాలి? కేజ్రీవాల్‌ నాకంటే పెద్ద దొంగ’ అని వ్యాఖ్యానించాడు.

2017లో తాను తీహాడ్‌ జైలులో ఉన్న సమయంలో జైళ్లశాఖ నిర్వహిస్తున్న సత్యేంద్రజైన్‌ తనను కలిశారని, పార్టీకి విరాళమిస్తే జైలులో సౌకర్యవంతమైన ఏర్పాట్లు చెయ్యమని అధికారులకు సూచిస్తానని చెప్పినట్లు లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఓ సీనియర్‌ పోలీసు అధికారికి  కూడా రూ.12.5 కోట్లు ఇచ్చానని తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని