Sabarimala: శబరిమలకు పోటెత్తిన భక్తులు

ఓ వైపు దేశంలో ఒమిక్రాన్‌ వైరస్‌ వ్యాప్తి నెలకొన్న క్రమంలో.. శబరిమలలో భక్తులు పోటెత్తారు. శనివారం రికార్డు స్థాయిలో 42,354 మంది దర్శనం చేసుకున్నట్లు ...

Published : 05 Dec 2021 23:55 IST

తిరువనంతపురం: ఓ వైపు దేశంలో ఒమిక్రాన్‌ వైరస్‌ వ్యాప్తి నెలకొన్న క్రమంలో.. శబరిమలలో భక్తులు పోటెత్తారు. శనివారం రికార్డు స్థాయిలో 42,354 మంది దర్శనం చేసుకున్నట్లు కేరళ సర్కారు తెలిపింది. శుక్రవారం 27,840 మంది దర్శనం చేసుకున్నారని పేర్కొంది. ఆలయంలోకి ప్రవేశించే భక్తులకు పోలీసులు.. శానిటైజ్‌ చేసి, మాస్కులు అందిస్తున్నారని వివరించింది. డిసెంబరు 9 నుంచి వర్చువల్‌ క్యూ పద్ధతిలో బుకింగ్‌ చేసుకునే విధానం పూర్తవుతుందని స్పష్టం చేసింది. వర్చువల్‌ బుకింగ్‌తో పాటు రోజూ దాదాపు 5వేల మంది భక్తులకు స్పాట్‌ బుకింగ్‌ అనుమతిస్తున్నట్లు పేర్కొంది. మండల- మహావిరక్కు కోసం డిసెంబరు 26 వరకు ఆలయం తెరిచే ఉంటుంది. సంక్రాంతి సందర్భంగా డిసెంబరు 30న మళ్లీ శబరిమల ఆలయం తెరచుకుంటుంది. జనవరి 20 వరకు భక్తులను అనుమతిస్తారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని