కరోనా నియంత్రణకు మరో ఏడు వ్యాక్సిన్లు

కరోనాను కట్టడించేందుకు దేశంలో ఇప్పటికే కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలను అందిస్తుండగా దేశీయంగా మరో ఏడు వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ వెల్లడించారు....

Published : 07 Feb 2021 15:30 IST

దిల్లీ: కరోనాను నియంత్రించేందుకు దేశంలో ఇప్పటికే కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలను అందిస్తుండగా దేశీయంగా మరో ఏడు వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ వెల్లడించారు. కేవలం రెండు టీకాలపైనే ఆధారపడలేమని పేర్కొన్నారు. భారత్‌ పెద్ద దేశం కావడంతో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ అందించేలా పలు కంపెనీలు పరిశోధనలు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ ఏడు వ్యాక్సిన్లలో మూడు క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉన్నాయని తెలిపారు. దేశంలోని ప్రతిఒక్కరికి టీకా అందించేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ను బహిరంగ మార్కెట్‌లో ఉంచేందుకు ప్రభుత్వం వద్ద తక్షణ ప్రణాళిక ఏమీ లేదన్నారు. ఈ అంశంపై డిమాండ్‌ను బట్టి నిర్ణయం తీసుకుంటామని హర్షవర్ధన్‌ తెలిపారు. 50 ఏళ్లకు పైబడినవారికి కరోనా టీకా పంపిణీని మార్చిలో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. కొవిడ్‌ టీకాను అత్యవసర ప్రాతిపదికన పూర్తి పర్యవేక్షణలో అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చదవండి...

కొవిడ్‌ టీకా.. 13 నుంచి రెండో డోస్‌

టీకా కార్యక్రమం వేగం పెంచండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని