Corona: కట్టడిలోనే కరోనా ఉద్ధృతి.. కొత్త కేసులు ఎన్నంటే..?

దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉన్నట్లు కన్పిస్తోంది. గత కొన్నిరోజులుగా కొత్త కేసులు అదుపులోనే ఉండటంతో పాటు రికవరీలు పెరుగుతుండటం కాస్త ఊరటనిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4లక్షల

Published : 04 Aug 2022 10:09 IST

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉన్నట్లు కన్పిస్తోంది. గత కొన్నిరోజులుగా కొత్త కేసులు అదుపులోనే ఉండటంతో పాటు రికవరీలు కూడా పెరుగుతుండటం కాస్త ఊరటనిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4లక్షల మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించగా.. 19,893 మందికి పాజిటివ్‌గా తేలింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.94శాతంగా ఉంది.

కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన కరోనా గణాంకాలు ఇలా ఉన్నాయి..

* 24 గంటల్లో నమోదైన కొత్త కేసులు - 19,893

* రికవరీలు - 20,419 (మొత్తం రికవరీలు 4.34కోట్లు)

* రికవరీ రేటు - 98.50 శాతం

* ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న క్రియాశీల కేసులు - 1,36,478

* యాక్టివ్‌ కేసుల రేటు - 0.31శాతం

* 24 గంటల్లో మరణాలు - 53 (మొత్తం మరణాలు 5.26లక్షలు)

* నిన్న పంపిణీ అయిన వ్యాక్సిన్‌ డోసులు - 38.20లక్షలు

* ఇప్పటి వరకు మొత్తం పంపిణీ అయిన డోసులు - 205.22కోట్లు

మరోవైపు దేశంలో మంకీపాక్స్‌ కేసులు పెరుగుతుండటం కాస్త భయపెడుతోంది. నిన్న దేశ రాజధాని దిల్లీలో మరో వ్యక్తికి మంకీపాక్స్‌ పాజిటివ్‌గా తేలింది. ఇప్పటివరకు దేశంలో మొత్తం 9 మంది ఈ వ్యాధి బారిన పడగా.. ఓ మరణం చోటుచేసుకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని