Lockdown: దిల్లీలో మరో వారం పొడిగింపు

దేశ రాజధాని దిల్లీలో కరోనా రోజువారీ కేసులు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ.. లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. రేపటితో ముగియనున్న లాక్‌డౌన్‌ను మరోవార.......

Published : 16 May 2021 13:06 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కరోనా రోజువారీ కేసులు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ.. లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. రేపటితో ముగియనున్న లాక్‌డౌన్‌ను మరోవారం పాటు పొడిగిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్‌ వర్చువల్‌గా జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించారు.

దిల్లీలో మునుపటితో పోలిస్తే పాజిటివిటీ రేటు తగ్గినప్పటికీ.. ఇంకా ఆందోళనకరంగానే కొనసాగుతోందని వైద్యనిపుణులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే లాక్‌డౌన్‌ను మరో వారం పొడిగించినట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ వల్ల కరోనాను కట్టడి చేయగలుగుతున్నామని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. ఇప్పటి వరకు సాధించిన సత్ఫలితాల్ని చేజార్చుకోకుండా ఉండాలనే లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు కేజ్రీవాల్‌ తెలిపారు. దిల్లీలో రోజువారీ కేసులు 10 వేల దిగువన నమోదవుతుండడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని