Modi: మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ...

భారతప్రధాని మోదీ ఈరోజు 72వ పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. ఆయనకు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురుప్రముఖులు మోదీని ప్రశంసిస్తూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Updated : 17 Sep 2022 13:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత ప్రధాని మోదీ 72వ పుట్టిన రోజు నేడు.  ఈ సందర్భంగా ఆయనకు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖులు మోదీని ప్రశంసిస్తూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా మోదీ ఈరోజు పలు కార్యక్రమాలతో బీజీగా గడపనున్నారు.

* ‘‘ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టిన రోజు సందర్భంగా హృదయపూర్వక అభినందనలు. సాటిలేని కఠోర శ్రమ, అంకితభావం, సృజనాత్మకతతో మీరు చేపడుతున్న దేశ నిర్మాణ సంగ్రామం కొనసాగాలనీ.. మీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. భగవంతుడు మీకు మంచి ఆరోగ్యాన్ని, దీర్ఘాయువును ప్రసాదించాలి.’’ -  రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.

 * ‘‘నరేంద్రమోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. దేశంలో సుపరిపాలన అందించేందుకు మోదీ ఎంతో కృషి చేశారు. ఆయన నాయకత్వంలో దేశం సరికొత్త శిఖరాలకు చేరుకుంది.’’  - కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్‌ సింగ్‌.

* ‘‘దేశ అభిమాన నాయకుడు, మనందరికీ స్ఫూర్తి అయిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి జన్మదిన శుభాకాంక్షలు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల మోదీ.. పేదల సంక్షేమానికి కృత నిశ్చయంతో ఉన్నారు’’ -  కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా.

* భారత ప్రధాని నరేంద్రమోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు - కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ.

* తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని.. మరింతకాలం దేశానికి సేవ చేయాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా - తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని