Rameshwaram Cafe: బెంగళూరు బాంబు పేలుడు కేసులో కీలక వ్యక్తి అరెస్టు

బెంగళూరు కెఫే బాంబు పేలుడు కేసులో అనుమానితుడిని ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ఇతను ప్రధాన నిందితుడికి సహకరించినట్లు అనుమానిస్తున్నారు. 

Updated : 13 Mar 2024 12:50 IST

బెంగళూరు: రామేశ్వరం కెఫే (Rameshwaram Cafe) బాంబు పేలుడు కేసులో కీలక వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్టు చేసింది. బుధవారం కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో కస్టడీలోకి తీసుకున్నట్లు ఎన్‌ఐఏ అధికారి తెలిపారు. నిందితుణ్ని షబ్బీర్‌గా గుర్తించారు. ప్రస్తుతం రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ అరెస్టుపై ఎన్‌ఐఏ అధికారిక ప్రకటన చేయలేదు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తికి ఇతను సహకరించినట్లు సమాచారం. 

ఈ నెల ఒకటో తేదీన బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్‌లో ఉన్న రామేశ్వరం కెఫేలో బాంబు పేలిన ఘటనలో 9 మంది గాయపడ్డారు. ఈ కేసును కర్ణాటక హోంశాఖ ఎన్‌ఐఏకు అప్పగించింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి చిత్రాలను విడుదల చేశారు. అతని ఆచూకీ చెప్పిన వారికి రూ.10 లక్షల నగదు రివార్డును ఎన్‌ఐఏ ప్రకటించింది. ఈ కేసులో నిందితుడు ఆర్‌డీఎక్స్‌ ఉపయోగించాడని నిపుణులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే తొలి అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని