Citizenship Act: సీఏఏకు సవరణల్లేవ్‌.. తేల్చి చెప్పిన కేంద్రం

పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) సవరణలు చేసే ఉద్దేశమేదీ లేదని కేంద్రం స్పష్టంచేసింది. కొత్తగా ఇతర మైనారిటీలను ఈ జాబితాలో చేర్చే అంశమేదీ  పరిశీలనలో లేదని తేల్చిచెప్పింది.

Published : 04 Aug 2021 20:50 IST

దిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) సవరణలు చేసే ఉద్దేశమేదీ లేదని కేంద్రం స్పష్టంచేసింది. కొత్తగా ఇతర మైనారిటీలను ఈ జాబితాలో చేర్చే అంశమేదీ  పరిశీలనలో లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ నుంచి తరలివచ్చిన హిందూ, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు 2019లో సీఏఏను కేంద్రం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఈ చట్టానికి నిబంధనల రూపకల్పన చేయాల్సి ఉందని నిత్యానందరాయ్‌ చెప్పారు. ఇందుకు 2022 జనవరి 9 వరకు పార్లమెంట్‌ గడువు ఇచ్చిందని వెల్లడించారు. నిబంధనల రూపకల్పన జరిగాకే దరఖాస్తులు పరిశీలించి పౌరసత్వం అందిస్తామని చెప్పారు. సాధారణంగా చట్టం రూపుదాల్చిన తర్వాత ఆరు నెలల్లోగా నియమ నిబంధనలను రూపొందించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు నిబంధనల ఖరారుకు 5 సార్లు కేంద్రం గడువు కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు