Ram Temple: అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠకు వెళ్లట్లేదు.. వారిని తీసుకొని తర్వాత వెళ్తా: సీఎం శిందే

అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఇప్పుడు తాను హాజరు కావట్లేదని.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి తర్వాత దర్శించుకోవాలనుకొంటున్నట్లు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే తెలిపారు.

Published : 21 Jan 2024 17:29 IST

Ayodhya Ram Mandir| ముంబయి: అయోధ్యలో మరికొద్ది గంటల్లో జరగనున్న బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకకు తాను హాజరు కావడంలేదని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) వెల్లడించారు. తన కేబినెట్‌ సహచరులు, ఎమ్మెల్యేలు, ఎంపీలందరినీ తీసుకొని ఆ తర్వాత రామ మందిరాన్ని దర్శించుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. ఆదివారం ముంబయిలో టాటా మారథాన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. అయోధ్యలో జరగబోయే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి కొద్దిమందితో కాకుండా  రాష్ట్ర మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి వెళ్తానన్నారు.  మనందరి విశ్వాసానికి, గర్వకారణానికి ప్రతీకగా నిలిచే అయోధ్య రామమందిరానికి అధికారులు, భక్తుల్ని సైతం తీసుకెళ్లాలనుకొంటున్నట్లు చెప్పారు. సోమవారం జరగనున్న ఈ అద్భుత ఘట్టం నేపథ్యంలో మహారాష్ట్రలోని ఆలయాలను పరిశుభ్రం చేసి.. దీపాలతో అలంకరించాలని అధికారుల్ని ఆదేశించినట్లు చెప్పారు. 

అందుకే కొత్త విగ్రహం.. ఆలయ నిర్మాణానికి రూ.1,100 కోట్లకుపైగా ఖర్చు!

మరోవైపు, భాజపా సీనియర్‌ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ కూడా ఫిబ్రవరిలో రామసేవ కోసం అయోధ్యను సందర్శిస్తానని నాగ్‌పుర్‌లో విలేకర్లతో చెప్పారు.  సోమవారం జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ప్రభుత్వం అతిథులుగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి దాదాపు 8వేల మంది అతిథులు విచ్చేస్తుండగా.. వీరిలో 506 మందిని అత్యంత ప్రముఖులుగా ఎంపిక చేశారు. ఇప్పటికే అనేకమంది ప్రముఖులు ఒక్కొక్కరిగా అయోధ్యకు చేరుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు