
Published : 24 Oct 2021 19:12 IST
Picasso: పికాసో చిత్రాలకు 110 మిలియన్ డాలర్లు..
ఇంటర్నెట్‌డెస్క్ : ప్రముఖ చిత్రకారుడు పికాసో గీసిన చిత్రాలకు 110 మిలియన్ డాలర్ల ధర లభించింది. ఈ చిత్రం 20 ఏళ్లుగా ఓ హోటల్ గదిలో ఉన్నాయి. లాస్‌వేగాస్‌లోని బెల్లాజియో హోటల్‌లో సౌత్‌బే ఆక్షన్ సంస్థ ఈ వేలం నిర్వహించింది. మొత్తం ఐదు చిత్రాలను ఈ వేలంలో విక్రయించారు. ఈ హోటల్లో మరో 12 పికాసో చిత్రాలు కూడా ఉన్నాయి.
1938లో వేసిన ‘వుమెన్ ఇన్ ఏ రెడ్-ఆరెంజ్ ’చిత్రానికి 40.5 మిలియన్ డాలర్ల ధర పలికింది. వాస్తవానికి అంచనావేసినదాని కంటే 10 మిలియన్ డాలర్లు అదనపు ధర లభించింది. మిగిలిన వాటిల్లో ఒక దానికి 24.4 మిలియన్ డాలర్లు, 9.5 మిలియన్ డాలర్లు, 2.1 మిలియన్ డాలర్లు చొప్పున ధర లభించింది. ఈ చిత్రాల కొనుగోలుదారుల పేర్లను మాత్రం ఆక్షన్ సంస్థ బహిర్గతం చేయలేదు.
ఇవీ చదవండి
Tags :