Rahul Gandhi: ముంబయిలో ముగిసిన ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఆధ్వర్యంలో కొనసాగిన ‘భారత్ జోడో న్యాయ్‌ యాత్ర (Bharat Jodo Nyay Yatra)’ ముంబయిలో ముగిసింది.

Published : 16 Mar 2024 23:36 IST

ముంబయి: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఆధ్వర్యంలో కొనసాగిన ‘భారత్ జోడో న్యాయ్‌ యాత్ర (Bharat Jodo Nyay Yatra)’ ముగిసింది. మణిపుర్‌ నుంచి ముంబయి వరకు 63 రోజులపాటు కొనసాగింది. సెంట్రల్‌ ముంబయిలోని బీఆర్‌ అంబేడ్కర్‌ స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించిన రాహుల్‌.. రాజ్యాంగ పీఠికను చదివారు. ఆదివారం మణిభవన్‌ నుంచి ఆగస్టు క్రాంతి మైదాన్‌ వరకు ‘న్యాయ్‌ సంకల్ప్‌ పాదయాత్ర’ నిర్వహించనున్నారు.

యాత్రలో భాగంగా అంతకుముందు ధారావిలో మాట్లాడిన రాహుల్‌ గాంధీ.. తమ పార్టీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కుల గణన చేపడతామన్నారు. పేద మహిళలకు ఏటా రూ.లక్ష ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. స్థానికంగా చేపడుతోన్న అభివృద్ధి ప్రాజెక్టుపై ఆందోళన వ్యక్తం చేశారు. ధారావిని మాన్యుఫాక్చరింగ్‌ హబ్‌గా మారుస్తానని అన్నారు.

మణిపుర్‌లోని తౌబాల్‌ జిల్లాలో జనవరి 14న భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ప్రారంభమైంది. దాదాపు 100కిపైగా జిల్లాలు, 100 లోక్‌సభ స్థానాల మీదుగా కొనసాగింది. 63 రోజుల అనంతరం ముంబయి చేరుకుంది. ఆదివారం విపక్షాల ‘ఇండియా’ కూటమి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తోపాటు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌, తదితరులు పాల్గొననున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని