Delhi: అత్యవసరంగా వయనాడ్‌కు రాహుల్‌..

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్‌ న్యాయ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. శనివారం సాయంత్రం ఆయన వయనాడ్‌కు వెళ్లారు.

Published : 17 Feb 2024 23:21 IST

దిల్లీ: వరుసగా ఏనుగులు ప్రజలపై దాడులు చేస్తుండడంతో వయనాడ్‌(Wayanad)లో నిరసనలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) భారత్‌ న్యాయ్‌యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. శనివారం సాయంత్రం ఆయన వయనాడ్‌కు వెళ్లారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్(Jairam Ramesh) ‘ఎక్స్‌’ (ట్విటర్‌) ద్వారా తెలిపారు. ‘రాహుల్ గాంధీ అత్యవసరంగా వయనాడ్‌కు వెళ్లాల్సి వచ్చింది. న్యాయ్ యాత్ర ఫిబ్రవరి 18న మధ్యాహ్నం 3 గంటలకు ప్రయాగ్‌రాజ్‌లో తిరిగి ప్రారంభమవుతుంది’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని