Omicron: దేశంలో 21కి చేరిన ఒమిక్రాన్‌ కేసులు.. రాజస్థాన్‌లో కొత్తగా మరో 9

దేశంలో కొత్తగా మరో 7 ఒమిక్రాన్‌ వేరియంట్‌ కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఈ కేసులు వెలుగుచూశాయి.

Updated : 05 Dec 2021 20:40 IST

ముంబయి: దేశంలో కొత్తగా మరో 16 ఒమిక్రాన్‌ వేరియంట్‌ కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా మహారాష్ట్రలో 7, రాజస్థాన్‌లో 9 కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 21కి చేరింది. ఇప్పటికే కర్ణాటకలో రెండు, గుజరాత్‌లో ఒకటి, దిల్లీలో ఒకటి, ముంబయిలో ఒకటి చొప్పున కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

నైజీరియా నుంచి వచ్చిన మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్‌కు చెందిన ఓ మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు, ఆ మహిళ సోదరుడు, అతడి ఇద్దరు కుమార్తెల్లో ఈ వేరియంట్‌ వెలుగుచూసింది. అలాగే ఫిన్లాండ్‌ నుంచి పుణె వచ్చిన మరో వ్యక్తిలోనూ ఈ రకం వైరస్‌ గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఒక్క మహారాష్ట్రలోనే ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 8కి చేరింది. అలాగే రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లోని ఆదర్ష్‌నగర్‌కు చెందిన ఒకే కుటుంబంలోని 9మందికి ఈ రకం వేరియంట్‌ వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వీరంతా దక్షిణాఫ్రికా నుంచి ఇటీవల వచ్చినట్లు వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని