
Corona Virus: మహారాష్ట్ర ఆదేశాలపై కేంద్రం అభ్యంతరం
దిల్లీ: విమానాల్లో ముంబయి వచ్చే ప్రయాణికులు విషయమై మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై కేంద్రం అభ్యంతరం తెలిపింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విమానాల ద్వారా ముంబయి వచ్చే ప్రయాణికులు కరోనా నెగిట్ రిపోర్టును చూపించాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 72 గంటల్లోపు చేసిన పరీక్ష నివేదికనే తీసుకురావాల్సి ఉంటుంది. ఇలాంటి రిపోర్టు లేని వారిని అసలు విమానంలోకి ఎక్కించుకోకూడదని అధికారులు సూచించారు. ముప్పు ఉన్న దేశాల నుంచి వచ్చే వారు వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండడంతో పాటు, వచ్చిన 2, 4, 7వ రోజుల్లో పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. నెగిటివ్ రిపోర్టు వచ్చిన వారు కూడా 14 రోజుల పాటు ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండాలి. పాజిటివ్ వస్తే ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది. ఏడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండడం, వారంలో మూడు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించాలన్న ఆదేశాలను కేంద్రం తప్పుపట్టింది. ఇది తాము ఇచ్చిన ప్రామాణిక విధివిధానాలకు అనుగుణంగా లేదని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు.
Advertisement