Rafale: రఫేల్‌ విమానాల అప్‌గ్రెడేషన్‌కు వాయుసేన నిర్ణయం.. ఎందుకో తెలుసా?

ఫ్రాన్స్‌ నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలను వచ్చే ఏడాది జనవరి నుంచి అప్‌గ్రేడ్ చేయాలని వాయుసేన నిర్ణయించింది.....

Published : 21 Nov 2021 22:11 IST

దిల్లీ: ఫ్రాన్స్‌ నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలను వచ్చే ఏడాది జనవరి నుంచి అప్‌గ్రేడ్ చేయాలని వాయుసేన నిర్ణయించింది. ఇప్పటికే ఫ్రాన్స్ నుంచి 30 రఫేల్ విమానాలు భారత్‌కు చేరుకోగా.. మరో మూడు డిసెంబర్‌లో రానున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక మెరుగులు దిద్దేందుకు వాయుసేన సిద్ధమైంది. ఇప్పటికే అప్‌గ్రేడ్‌కు సంబంధించిన ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం. భారత వాయుసేన ఆమోదం అనంతరం వచ్చే ఏడాది జనవరి నుంచి అప్‌గ్రేడ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

2016లో రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో రూ.60వేల కోట్లతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం అప్‌గ్రేడ్‌కు అవసరమైన పరికరాలను ఫ్రాన్స్ సరఫరా చేయాల్సి ఉంటుంది. రఫేల్ యుద్ధ విమానాల అప్‌గ్రెడేషన్ ప్రక్రియ హరియాణాలోని అంబాలా ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో జరగనుంది. మరోవైపు రఫేల్ యుద్ధ విమానాలను నడపడంలో ఫైలెట్‌లకు శిక్షణ ప్రారంభమైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు